Balakrishna : ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఎవ్వరూ ఊహించని రేంజ్ ఫామ్ ని చూపిస్తూ హిట్ మీద హిట్ కొడుతున్న హీరో నందమూరి బాలకృష్ణ. పొరపాటున కూడా ఇప్పుడు ఆయనకీ ఫ్లాప్ పడేలా లేదు. ఆ రేంజ్ ప్లానింగ్ లో ఉన్నాడు. ‘అఖండ’ తో మొదలైన బాలయ్య బాబు జైత్ర యాత్ర ‘భగవంత్ కేసరి’ వరకు కొనసాగింది. అదే జైత్ర యాత్ర ని కొనసాగించడానికి ఆయన రీసెంట్ గా బాబీ తో ఒక సినిమా ఒప్పుకున్నాడు.

ఈ ఏడాది బాబీ మెగాస్టార్ చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తీసిన సంగతి తెలిసిందే. బాలయ్య తో కూడా లాంటి పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా తీసి ఇండస్ట్రీ ని షేక్ చెయ్యాలని చూస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం రంపచోడవరం లోని మారేడుమల్లి దట్టమైన అడవుల్లో జరుగుతుందట. ఈ అడవుల్లో ఎక్కువగా పులుల సంచారం ఉంటుందని అక్కడి గ్రామస్తులు అంటూ ఉంటారు. అలాంటి చోట షూటింగ్ చెయ్యడం చాలా రిస్క్. ఇప్పుడు అలాంటి ప్రాంతాలలో షూటింగ్ చెయ్యడం అవసరమా, ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నారు అని బాలయ్య అభిమానులు డైరెక్టర్ బాబీ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు.

అయితే సరైన ప్రొటొకాల్స్ ని అనుసరించి, జాగ్రత్తలు తీసుకొనే షూటింగ్ చేస్తున్నారని, అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రం లో తమిళ హీరో బాబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బాలయ్య రెండవ పాత్ర కోసం త్రిష ని తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఊర్వశి రౌతుల కూడా ఈ చిత్రం లో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం.
