Balakrishna : వామ్మో.! బాలయ్య ఫ్యాన్స్ ఏంటా ఇలా ఉన్నారు.. ఏకంగా పొట్టేలు తలకాయలతో దండ

- Advertisement -

Balakrishna : బాలకృష్ణ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే. ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసిన చిత్రాలను అందించారు బాలయ్య. ఇక ఆయన సినిమాల్లో మాసిజం ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఆయన ఫ్యాన్స్ ఎంతటి మాస్ గా ఉంటారో చెప్పనక్కర్లేదు. కానీ ఇంత రేంజ్ లో మాస్ అనే విధంగా ఉంటారని చూసి షాక్ అవుతున్నారు జనాలు. బాలకృష్ణ ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లు మొఖం మీదే మాట్లాడుతాడు. అందుకే ఆయనను అభిమానించే జనాలు కూడా అలానే ఉంటారు. మరి ముఖ్యంగా ఆయనను తన అభిమానులు వారి ఇంటి పెద్ద దిక్కులా భావిస్తారు.

ఇటీవల హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలకృష్ణ భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించడంతో బాలయ్య ఫ్యాన్స్ ఊర నాటు రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సాధారణంగా ఎవరైనా సరే గెలిస్తే ఏం చేస్తారు..? పార్టీలు చేసుకుంటారు. వారి అభిమాన నాయకుల ఫోటోకి పూలమాలలు వేసి సత్కరిస్తారు. అయితే ఇక్కడ బాలయ్య ఫ్యాన్స్ అందరికంటూ డిఫరెంట్ గా ఆలోచించారు. పొట్టేలు తలకాయలు నరికేసి.. వాటితో మాలను కట్టి బాలయ్య కటౌట్ కి వేశారు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

- Advertisement -

ఈ వీడియో చూసిన జనాలు వామ్మో ఏంట్రా ఇది.. బాలయ్య ఫ్యాన్స్ ఇలా ఉన్నారు ..? అంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. బాలయ్య మాస్ ..బాలయ్య ఫ్యాన్స్ కూడా ఊరనాటు మాస్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా త్వరలోనే బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగులో పాల్గొనబోతున్నారు. అలాగే.. ఈ సారి చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here