Balakrishna : ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం, అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమో, లేదా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడమో జరగడం మనం ఎంతో కాలం నుండి చూస్తూనే ఉన్నాం. అలా మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా వదిలేసిన కొన్ని సినిమాలను వేరే హీరోలు చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి, అలాగే డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కథ నచ్చకనో, లేదా డేట్స్ సర్దుబాటు చెయ్యలేకనో చిరంజీవి ఆ సినిమాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అలా చిరంజీవి వదులుకున్న ఒక చిత్రం బాలయ్య బాబు చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. మెగాస్టార్ తో ‘ఇంద్ర’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తీసిన బి గోపాల్, ఈ సినిమాకంటే ముందుగా ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడు.

ఆ చిత్రం పేరు ‘రౌడీ ఇన్స్ పెక్టర్’ నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా కథని ముందుగా చిరంజీవి కి వినిపిస్తే, ఆయనకి సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చకపోవడం తో రిజెక్ట్ చేసాడట. ఆ తర్వాత ఈ కథ బాలయ్య బాబు వద్దకి వెళ్ళింది. ఆయనకి కథ తెగ నచ్చేసి వెంటనే డేట్స్ ఇచ్చేసాడు.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే బాలయ్య బాబు కి ఫోన్ చేసి, ఆ కథ అంతలా నచ్చిందా, సెకండ్ హాఫ్ ని పూర్తిగా విన్నావా అని అడిగాడట. హా విన్నాను బ్రదర్, నాకు బాగా నచ్చేసింది, డేట్స్ కూడా ఇచ్చేసాను అని చెప్పాడట. అప్పుడు చిరంజీవి తొందరపడ్డావ్ ఏమో ఒకసారి ఆలోచించుకో అన్నాడట. కానీ బాలయ్య అది పట్టించుకోకుండా ఈ సినిమాని చేసాడు, కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.
