ఈమధ్య కాలం లో రీమేక్ సినిమాలను జనాలు ఒక రేంజ్ లో తిప్పి కొడుతున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు తప్ప, మిగతా హీరోల రీమేక్ సినిమాలు కనీస స్థాయిలో కూడా ఆడడం లేదు. రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం పరిస్థితి ఎలా అయ్యిందో అందరూ చూసారు.

8 ఏళ్ళ క్రితం తమిళం లో విడుదలైన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కడం దానికి తోడు మెహర్ రమేష్ దర్శకుడు అవ్వడం వల్లే ఈ చిత్రం ఆ స్థాయి డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం కూడా రీమేక్ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. గతం లో బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ ‘స్వామి’ అనే చిత్రం చేసాడు.

ఈ చిత్రం లో హరికృష్ణ అల్లారు ముద్దుగా పెంచుకునే కూతురు కోసం ఏమైనా చెయ్యడానికి సిద్దపడే తండ్రిగా కనిపిస్తాడు. ఇందులో హరికృష్ణ కి జోడిగా మీనా నటిస్తాది. అయితే ‘భగవంత్ కేసరి’ చిత్రం స్టోరీ లైన్ కూడా స్వామి మూవీ స్టోరీ లైన్ కి చాలా దగ్గరగా ఉంటుందని సమాచారం. ఇందులో బాలయ్య కి కూతురు గా శ్రీలీల నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం లో కూతురు చేసిన తప్పుని తన మీద వేసుకొని జైలు శిక్ష అనుభవిస్తాడు, ఆ తర్వాత జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత తన కూతురిని రౌడీ మూకల నుండి కాపాడుకుంటూ వస్తాడు. బాలయ్య మార్కు యాక్షన్ తో పాటుగా, అనిల్ రావిపూడి మార్కు కామెడీ ని జతచేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు ‘స్వామి’ మూవీ ఆడియన్స్ కి గుర్తుకు రాకపోతే చాలు, బాక్స్ ఆఫీస్ ని దున్నేయొచ్చు అని అభిమానులు అనుకుంటున్నారు.