Balakrishna : ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కెరీర్ ఎంత పీక్ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ క్షణమున ఆయన అఖండ చిత్రం చేసాడో కానీ, అప్పటి నుండి ఆయనకీ మహర్దశ పట్టుకుంది. అటు సినిమాలు అయినా, రాజకీయాలు అయినా పట్టిందల్లా బంగారం అయిపోతుంది బాలయ్య కి. ఇటీవలే రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యే గా గెలుపొంది వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన అతి తక్కువమంది సినీ నటులలో ఒకడిగా నిలిచాడు. అలాగే అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుసగా మూడు హ్యాట్రిక్ హిట్స్ తో సినిమాల పరంగాను తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బాబీ తో ఒక సినిమా చేస్తున్నాడు.

వీటితో పాటు ఆయన త్వరలోనే బోయపాటి శ్రీనుతో రెండు సినిమాలు చేయనున్నాడు, అందులో అఖండ 2 కూడా ఒకటి. అంతే కాకుండా ఇదే ఏడాదిలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలా బాలయ్య బాబు కి ఎటు చూసినా ఆనందమే కనిపిస్తుంది. ఇకపోతే బాలయ్య భవిష్యత్తులో ఒక క్రేజీ మల్టీ స్టార్రర్ చేయబోతున్నాడని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో బలమైన టాక్ వినిపిస్తుంది. ఎనెర్జీటిక్ స్టార్ రామ్ తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని చేయబోతున్నారట. బాలయ్య కి వీర సింహా రెడ్డి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇప్పటికే బాలయ్య కి రామ్ కి ఆయన స్టోరీ లైన్ కూడా చెప్పి ఒప్పించాడట. పూర్తి స్థాయి స్క్రిప్ట్ డెవలప్ చేసి, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరో ఏడాది సమయం కచ్చితంగా పడుతుంది అనొచ్చు. ప్రస్తుతం రామ్ హీరోగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఆగస్టు 15 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ బాబు తో ఒక సినిమా చేయనున్నాడు. అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా ఆయన ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ముందుగా మహేష్ బాబు చిత్రం వెంటనే మొదలవుతుంది. ఆ తర్వాత బాలయ్య తో మల్టీ స్టార్రర్ చిత్రం మొదలవచ్చు అని టాక్ వినిపిస్తుంది.