Balakrishna : నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి నటను పునికి పుచ్చుకున్ని అగ్రహీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నారు బాలకృష్ణ. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా పిలుస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచారాలు తెరమీదకు వస్తూ ఉండగా షూటింగ్ మాత్రం శరవేగంగా పూర్తి చేసే పనిలో సినిమా యూనిట్ ఉంది.

ఇది ఇలా ఉంటే.. బాలకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. కారణం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తో పాటు దేశం మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ బరిలో నిలుస్తున్న తరుణంలో తన నియోజకవర్గ ప్రచారంతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన స్టార్ క్యాంపెనర్ గా కూడా వ్యవహరించబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలయ్య బాబు రెండు నెలల పాటు పూర్తిగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి ఆయన ఎన్నికల ప్రచారంలో దిగుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ప్రచారం నిమిత్తం రెండు కార్లు కూడా ఆయన సిద్ధం చేశారు. గతంలో తన కుమార్తె బ్రాహ్మణి ఇచ్చిన ఒక కారుతో పాటు మరొక కారుని కూడా ఈ ప్రచారం కోసం నందమూరి బాలకృష్ణ రెడీ చేసుకున్నారు. తాజాగా కార్లకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక టాక్సీవాలా దర్శకుడు రాహుల్ నందమూరి బాలకృష్ణను కలిసి ఓ కథ వివరించగా అది ఆయనకు బాగా నచ్చిందని.. ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.