బాలకృష్ణ చాలా ఫ్రెండ్లీ పర్సన్. అయితే కొన్నిసార్లు ఫ్యాన్స్ కోపం తెప్పించినప్పుడు కాస్త సీరియస్ అవుతారు. అయితే తాజాగా శ్రీలీల.. బాలకృష్ణ ఆగ్రహానికి గురైంది. శ్రీలీల(Sree Leela)ను బాలయ్య చెంపదెబ్బ కొట్టాడని , ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ వెళ్లిపోయింది. అయితే బాలయ్యకు శ్రీలీల ఎందుకు కోపం తెప్పించింది, ఏం తప్పు చేసిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ జరిగిన అసలు విషయం వేరే ఉంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా శ్రీ లీల ఒక కీలక పాత్రను నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో శ్రీ లీల చాలా చిల్లర వేషాలు వేసే అల్లరి పిల్లగా కనిపిస్తోందట. ఇక ఈ సినిమాలోని ఒక సన్ని విషయంలో శ్రీ లీల ఒక పెద్ద తప్పు చేస్తోందట. దీంతో ఈ తప్పు తెలుసుకున్న బాలయ్య తీవ్ర ఆగ్రహానికి గురవుతాడట. ఇక ఆ సమయంలో బాలయ్య ఆమెని లాగి పెట్టి కొట్టాల్సి వస్తుందిట. నిజంగా సినిమాల్లో ఇటువంటి సన్నివేశాలు నిజంగా చేయరు.
బాలకృష్ణ శ్రీలీలని చెంపదెబ్బ కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించారు మేకర్స్. భావోద్వేగాలు కృత్రిమంగా కాకుండా సహజంగా కనిపించేలా ఉండాలని శ్రీలీల అనుకుంది. నిజంగానే చెంప మీద కొట్టాలని బాలకృష్ణను శ్రీలీల అభ్యర్థించింది. ఆ తర్వాత బాలకృష్ణ శ్రీలీలను గట్టిగా కొట్టాడు. అందరూ షాక్తో మౌనంగా ఉండిపోయారు. అనిల్ రావిపూడి కూడా సైలెంట్ అయిపోయాడట. సీన్ పూర్తయిన తర్వాత కూడా కట్ చెప్పలేదు. ఆ షాట్ సహజంగా వచ్చిందని టాక్. శ్రీలీల షూటింగ్ లో భాగంగా ఏడుస్తూ వెళ్లిపోయింది. శ్రీలీల నిబద్ధతను అందరూ కొనియాడుతున్నారు.