మోక్షజ్ఞ కోసం హాట్ ఫిగర్ ని సెట్ చేసిన బాలకృష్ణ.. ఎవరో తెలుసా..

- Advertisement -

తన తనయుడు మోక్షజ్ఞ తేజ సినిమా రంగ ప్రవేశంపై అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీపై మాట్లాడారు. తన కుమారుడిని వచ్చే సంవత్సరం టాలీవుడ్‌లోకి పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య స్పష్టతనివ్వలేదు.

బాలకృష్ణ
బాలకృష్ణ

మోక్షజ్ఞను దర్శకుడు బోయపాటి శ్రీను లాంచ్‌ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై బాలకృష్ణ మాట్లాడుతూ.. ”అంతా దైవేచ్ఛ” అని నవ్వి ఊరుకున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఎంట్రీ అలా జరిగిపోతుందని, ఆ దేవుడి అనుగ్రహం లేనిదే ఏదీ జరగదని, ఆ సమయం రావాలని, అప్పటివరకూ మనమంతా వెయిట్ చేయాలంటూ వ్యాఖ్యానించారు. అనంతరం అఖండ-2’పై మాట్లాడారు. ‘అఖండ-2’ తప్పకుండా ఉంటుందని, దానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశామని, ప్రకటించడం ఒకటే మిగిలిందని, సమయం చూసి ప్రకటిస్తామని బదులిచ్చారు.

ఇలాంటి క్రమంలోని మోక్షజ్ఞ కూడా బరువు తగ్గి చాలా స్లిమ్ గా.. హ్యాండ్సమ్ గా ..తయారయ్యారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరంగేట్రం చేయబోతున్న మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ బ్యూటిఫుల్ అమ్మాయిని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . ఆమె మరి ఎవరో కాదు శ్రీలీల . ఇప్పటికే టాలీవుడ్ ని తన రెండు చేతులతో షేక్ చేసేస్తున్న ఈ బ్యూటీ మోక్షజ్ఞకు హీరోయిన్గా ఫైనలైజ్ అయ్యిందట . మోక్షజ్ఞ హైట్ కి.. వెయిట్ కి..శ్రీలీల అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని.. పైగా శ్రీలీల క్రేజ్ కూడా బాగుండడంతో మోక్షజ్ఞ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ నిర్ణయం తీసుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here