టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒకరు.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుని షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఇక ఈమె బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భగవంత్ కేసరి అనే సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా బసవతారకం హాస్పిటల్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. దీంతో బసవతారకం హాస్పిటల్ 23వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.
బాలయ్య తో పాటు పివి సింధు, హీరోయిన్ శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలయ్య ప్రసంగిస్తూ శ్రీలీల గురించి పొరపాటున నోరు జారారు. దీనితో భగవంత్ కేసరి చిత్రంలోని చిన్న సీక్రెట్ లీక్ అయింది. శ్రీలీల బిజీగా గడుపుతోంది అని చెబుతూ.. మా శ్రీలీల ఉంది.. ఉదయాన్నే మా సినిమా భగవంత్ కేసరిలో ఫైట్స్ చేసి ఇక్కడికి వచ్చింది అని పొరపాటున బాలయ్య చెప్పడం విశేషం. వెంటనే తేరుకుని రేపు మీరు చూసారుగా సినిమాలో అంటూ నోటికి తాళం వేసుకున్నారు.
భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య తొలిసారి తెలంగాణ యాసలో నటిస్తున్నారు. అనంతరం శ్రీలీల మాట్లాడుతూ.. కేన్సర్ ఆసుపత్రి కావడంతో తాను కూడా డాక్టర్ చదువుతున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. కాలేజీలో కేన్సర్ విభాగం అంటే మా ఫ్రెండ్స్ చాలా భయపడేవారు. కానీ ఇంతమంది డాక్టర్లు ఇక్కడ కేన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు అంటే గొప్ప విషయం. భగవంత్ కేసరి చిత్ర షూటింగ్ లో ఒక ఆసక్తికర ఇన్సిడెంట్ జరిగింది. నాకు కేర్ టేకర్ పాత్రలో నటిస్తున్న పెద్దావిడ ఒక రోజు ఎమోషనల్ గా కనిపించింది.