రీసెంట్ టైం లో సోషల్ మీడియా లో అత్యంత దుమారానికి రేపిన ఘటన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వసూళ్లు. హైదరాబాద్ లో సినిమాలకు అడ్డాగా పిలవబడే ఈ సెంటర్ లో ప్రస్తుతం ‘బ్రో ది అవతార్’ , ‘బేబీ’ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఆడుతున్నాయి.
అయితే దేవి 70 ఏం ఏం లో ఆడుతున్న పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం కంటే , సంధ్య 70 ఏం ఏం థియేటర్ లో ఆడుతున్న బేబీ సినిమాకి ఒక రోజు నూన్ షో లో ఎక్కువ వసూళ్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ దురాభిమానుల సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఎగతాళి చేస్తూ నెగటివ్ పబ్లిసిటీ చేసారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకు అనుమానం వచ్చి, 20 రోజులు దాటిన తర్వాత #RRR చిత్రానికి కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు. అలాంటిది బేబీ చిత్రం కి వచ్చిందా అనే అనుమానం తో కనుక్కుంటే అది కేవలం డీసీఆర్ రాసారని తెలిసింది.
డీసీఆర్ అంటే డైలీ కలెక్షన్ రిపోర్ట్ అన్నమాట. కొన్ని కొన్ని సార్లు పబ్లిసిటీ కోసం ఫేక్ కలెక్షన్స్ ని కూడా కలుపుతూ ఉంటారు. అలా ‘బేబీ’ చిత్రానికి కూడా చేసినట్టు రుజువు అయ్యింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కట్టలు తెంచుకొని ‘బేబీ’ మూవీ నిర్మాత SKN పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే రీసెంట్ గా ‘బేబీ’ సక్సెస్ టూర్ లో భాగంగా భీమవరం కి చేరుకున్న SKN మరియు మూవీ టీం పై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి జరిపారు అంటూ కొంతమంది ప్రచారం చేసిన వార్తలపై SKN స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఆకతాయిలు చేసే చిల్లర కామెంట్స్ ని అసలు పట్టించుకోను. బేబీ సక్సెస్ టూర్ కి వచ్చినప్పుడు మా బౌన్సర్స్ కి మరియు లోకల్ మీడియా కి మధ్య చిన్న తోపులాట జరిగి గొడవలు అయ్యాయి, ఆ తర్వాత నేను వచ్చి పరిష్కరించాను’ అంటూ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు.