Baby Collections : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్ ‘కలర్ ఫోటో’ ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘బేబీ’ చిత్రానికి విడుదల ముందే యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టీజర్, పాటలు మరియు ట్రైలర్ తో ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ ని సొంతం చేసుకుంది. అలా భారీ హైప్ తో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని,అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్స్ ని దక్కించుకుంది.

ఈ స్థాయి ఓపెనింగ్స్ వస్తాయని బహుశా దర్శక నిర్మాతలు కూడా ఊహించి ఉండరు. నిర్మాత SKN కి ఈ చిత్రం జాక్పాట్ అనే చెప్పాలి. విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఏ చిత్రానికి మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయని, మొదటి రెండు రోజులకంటే మూడవ రోజు ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చాయని. ఈ ఏడాది ఇలాంటి అరుదైన సంఘటన కేవలం రెండు మూడు సినిమాలకు మాత్రమే జరగగా, ఆ రెండు మూడు సినిమాలలో బేబీ చిత్రం ఒకటి అని చెప్పుకొస్తున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా రెండు కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఆ తర్వాత రెండవ రోజు రెండు కోట్ల 98 లక్షలు, మూడవ రోజు మూడు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. అలాగే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా ఇప్పటి వరకు ఈ చిత్రానికి మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా కలిపి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది 7 కోట్ల 40 లక్షల రూపాయిలకు మాత్రమే, అంటే కేవలం మూడు రోజుల్లోనే మూడు కోట్ల రూపాయిలు లాభాలు వచ్చింది అన్నమాట, మరి భవిష్యత్తులో ఎంత లాభాలను రాబడుతుందో చూడాలి.
