Baby Movie Collections : బయ్యర్స్ కి జాక్పాట్ తగిలినట్టే!

- Advertisement -

Baby Movie Collections : యూత్ ని ప్రమోషనల్ కంటెంట్ తో విశేషంగా ఆకట్టుకునేలా చేసిన ‘బేబీ’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల మొదటి ఆట నుండే ఈ సినిమాకి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. ప్రతీ షో కి టాక్ పెరుగుతూ పోవడం వల్ల ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్ దక్కిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల 40 లక్షల రూపాయలకు జరిగింది. మరి మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా ఒకసారి చూద్దాము.

Baby Movie Collections
Baby Movie Collections

ముఖ్యంగా ఈ సినిమా నైజాం ప్రాంతం వసూళ్ల గురించి మాట్లాడుకోవాలి. విడుదలకు ముందు రోజు హైదరాబాద్ సిటీ మొత్తం అన్నీ మెయిన్ థియేటర్స్ సాయంత్రం నుండి ప్రీమియర్స్ ని వేశారు. ఈ ప్రీమియర్స్ నుండి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. ఒక స్టార్ హీరో సినిమాకి ఎంత వసూళ్లు అయితే వస్తాయో, ఈ ప్రీమియర్స్ కి ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయి. ఇది ట్రేడ్ పండితులను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. టాక్ కూడా అద్భుతంగా రావడం తో మొదటి రోజు వసూళ్లకు బాగా వచ్చేలా చేసింది. నైజం ప్రాంతం లో ఈ సినిమాకి ప్రీమియర్స్ మరియు మొదటి రోజు వసూళ్లు కలిపి దాదాపుగా కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Baby Movie

ఆ తర్వాత సీడెడ్ లో 31 లక్షల రూపాయిల షర్ వసూళ్లు , ఉత్తరాంధ్ర లో 42 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 18 లక్షల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 లక్షల రూపాయిలు , గుంటూరు జిల్లాలో 15 లక్షల రూపాయిలు,కృష్ణ జిల్లాలో 8 లక్షల రుపాయిలు షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఏకంగా 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కి కూడా కలిపి ఈ చిత్రానికి 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.

- Advertisement -
Anand Baby Movie Collections

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మొదటి రోజు రాబట్టింది ట్రేడ్ పండితులు చెప్తున్నారు. వీకెండ్ లోపే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేసి 10 రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి.

Baby Collections
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here