Ayesha Khan : అబ్బబ్బబ్బ..ఏం అందం.. అందుకే కదా నీకు టాలీవుడ్ పడిపోయింది

- Advertisement -

Ayesha Khan : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో.. ఎవరిని ఎప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్క బెట్టుకోవాలని పెద్దలు చెప్పినట్లు ఇండస్ట్రీలో వారందరూ గ్లామర్ ఉన్నప్పుడే వరుస అవకాశాలను అందుకొని నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా హిట్ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లను మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన వారిని కూడా కుర్రకారు క్రష్ లా మార్చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ క్రష్ లిస్ట్ లోకి చేరింది బిగ్ బాస్ బ్యూటీ అయేషా ఖాన్.

అసలు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే.. నేడు ఓం భీమ్ బుష్ సినిమా చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది. ముఖచిత్రం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. హిందీ బిగ్ బాస్ 17 షోలో పాల్గొని రచ్చ లేపింది. హౌస్ నుంచి బయటకు వచ్చాకా అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా పెరగలేదు. ఇక ఓం భీమ్ బుష్ లో అమ్మడు ఉన్నది కొద్దిసేపే అయినా కూడా అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది.

- Advertisement -

ఇక ఇదొక్కటే కాకుండా ఈ అమ్మడు వరుస సినిమాలకు సైన్ చేసి అదరగొడుతుంది. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయేషా ఖాన్.. స్పెషల్ సాంగ్ చేస్తుంది. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. మోత అంటూ సాగే ఈ సాంగ్ హోలీరోజున రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో వైట్ చీరలో అయేషా.. చూసేందుకు అప్సరసలా కనిపిస్తుంది. ఇక ఈ సాంగ్ కనుక హిట్ అయితే ముద్దుగుమ్మను ఆపడం కష్టమే. ఇవే కాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ లో సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. అంతేకాదు సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో మరో సినిమా ఆఫర్ కూడా దక్కించుకున్నట్లు సమాచారం. ఇలా ఈ పిల్ల జోరు ఇప్పుడు మాములుగా లేదు. మరి ఈ చిన్నది ఏ రేంజ్ లో టాలీవుడ్ లో ఎదుగుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here