Guntur Kaaram : మరో వారం రోజుల్లో కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం విడుదల అవ్వబోతుంది. అతడు మరియు ఖలేజా వంటి క్లాసిక్స్ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇది. మహేష్ యాక్టింగ్ కెరీర్ ని రెండు భాగాలుగా విభజిస్తే, ‘ఖలేజా’ కి ముందు, ‘ఖలేజా ‘ కి తర్వాత అని చెప్పొచ్చు.

ఎందుకంటే మహేష్ లో ఆ కోణాన్ని మన ఆడియన్స్ అప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఆ సినిమా దగ్గర నుండి మహేష్ తన యాక్టింగ్ స్టైల్ ని పూర్తిగా మార్చేశాడు. మహేష్ లో ఆ రేంజ్ మార్పు తెచ్చిన త్రివిక్రమ్ , ‘గుంటూరు కారం’ లో కూడా ఆ రేంజ్ లో చూపించాడని అంటున్నారు ఈ సినిమా ప్రివ్యూ ని చూసిన కొంతమంది ప్రముఖులు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా పెట్టాడట త్రివిక్రమ్. ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణ భార్య భర్తలుగా నటించారు. వీళ్లిద్దరు మహేష్ బాబు కి తల్లితండ్రులు. కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయి ఉంటారు. క్లైమాక్స్ లో వీళ్ళను కలిపిన తర్వాతే సినిమాకి శుభం కార్డు పడుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ‘అత్తారింటికి దారేది’ రేంజ్ క్లైమాక్స్ ని ప్లాన్ చేసాడట.

సినిమాలో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా కుదిరాయని టాక్. సంక్రాంతికి ఆడియన్స్ కోరుకునే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అని, నాలుగు నుండి 5 యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి అని, మహేష్ లోని ఎనర్జిటిక్ కామెడీ టైమింగ్ ని త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఫుల్లుగా వాడేసాడని, అభిమానులకే కాదు ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం ఒక కనుల పండుగలాగ ఉంటుందని అంటున్నారు, చూడాలి మరి.
