Ashwini : అప్పుడప్పుడే గుర్తింపు కోసం కష్టపడుతున్న సెలబ్రిటీస్ కి బిగ్ బాస్ లాంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో లో అవకాశం రావడం ఒక వరం లాంటిది. కోట్లాది మంది ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా సదరు సెలబ్రిటీ కి మంచి పాపులారిటీ మరియు క్రేజ్ దక్కుతుంది. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తద్వారా ఫేమ్ ని సంపాదించి సినిమాల్లో పాపులర్ అయినా కంటెస్టెంట్స్ ఎంతో మంది ఉన్నారు.
ఒక్కసారి ఈ హౌస్ లోకి అడుగుపెట్టడమే అదృష్టం అని అనుకుంటుంటే, రతికా కి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ దక్కింది. మొదటిసారి ఆమె ఆడే కన్నింగ్ ఆటలకు విసెగెత్తిపియినా ఆడియన్స్ నాలుగు వారాలకే ఇంటి నుండి బయటకి నెట్టేశారు. ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రతికా తన ఆట తీరుని పూర్తిగా మార్చుకుంటుందని అందరూ అనుకున్నారు.
కానీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం లోనే ప్రేక్షకుల అంచనాలపై నీళ్లు చల్లేసింది. బయట శివాజీ మరియు అతని గ్యాంగ్ కి మంచి ఓటింగ్ పడుతుంది అనే విషయాన్నీ పసిగట్టిన రతికా, హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వారం నుండే ఆ గ్యాంగ్ లో చేరిపోయింది. ముఖ్యంగా యావర్ తో బాగా క్లోజ్ అయ్యింది, ఈమె మాయలో పడి యావర్ తన గేమ్ మొత్తాన్ని పాడు చేసుకుంటున్నాడు అని ఆయన అభిమానులకు సైతం అనిపించండి.
ఇదంతా పక్కన పెడితే రతికా ప్రవర్తనని చూసి అశ్వినీ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఆమె తన టీం మేట్స్ తో మాట్లాడుతూ ‘రతికా లాంటి అమ్మాయిని నేను ఇంట్లోనే కాదు, బయట కూడా ఎక్కడా చూడలేదు, ఎదో తేడాగా ఉంది ఈ అమ్మాయి’ అంటూ కామెంట్ చేసింది. ఈమె చేసిన ఈ కామెంట్స్ ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో చూపిస్తారో లేదో చూడాలి.