Ashu Reddy : చూసుకోవాలి కదా రా ఆషూ.. కావాలయ్యా అంటూ అక్కడ దెబ్బ తగిలించుకున్నవా..

- Advertisement -

Ashu Reddy : డబ్ స్మాష్ వీడియోలతో జనాల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించిన వారిలో ఆషు రెడ్డి ఒకరు. ఆ తరువాత సోషల్ మీడియాలో పలు రకాల వీడియోల్లో నటించి జూనియర్ సమంతగా ప్రేక్షకులతో పిలిపించుకుని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం అంటూ వైరల్ అయి ప్రేక్షకుల నోళ్లలో నానిపోయింది. తర్వాత అమ్మడు బాగా చర్చనీయాంశంగా మారింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎక్కువ కాలం నిలవలేకపోయింది.

Ashu Reddy
Ashu Reddy

సోషల్ మీడియాలో అషు రెడ్డి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ అమ్మడు మరొకవైపు ఫోటోషూట్లతో కూడా అదరగొడుతుంది. కిర్రాక్ అవుట్ ఫిట్ లో.. హాట్ హాట్ ఫోజులు ఇస్తూ కుర్రాళ్ల మతులు చెడగొడుతూ ఉంటుంది. మత్తెక్కించే అందాలకు కుర్రకారు ఫిదా అయిపోతుంటారు. అలాగే ఆమె చేసే వీడియోలను తన అభిమానులు నిత్యం ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా అషూరెడ్డి చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. జైలర్ సినిమాలో తమన్నా చేసిన సెన్సేషనల్ సాంగ్ కావాలయ్యా అనే పాటకు అషు రెడ్డి అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసింది. పలుచని డ్రసులో అందాలు కనిపించి కనిపించకుండా ఊరిస్తూ వివిధ రకాల యాంగిల్స్ లో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాను హీటెక్కించింది. డ్యాన్స్ బాగానే చేసింది కానీ చివరకు తన వెనకాల ఉన్న టేబుల్ కు కాలును తగిలించుకుంది. దీంతో కాలికి దెబ్బ తగిలింది. దీంతో పలువురు నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. తమన్నా డ్యాన్స్ ను బీట్ చేయడం అంత ఈజీ కాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. చూసుకోవాలి కదరా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here