Ashu Reddy : ప్రముఖ యాంకర్ అషు రెడ్డి గురించి ప్రత్యేకత పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని కాంట్రవర్సీకైరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంట్లో పడిన ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది అంతేకాదు ఆయనతో ఈమె చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ మరింత పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పాలి. అదే గుర్తింపుతో పలువురు సెలబ్రిటీలకు ఇంటర్వ్యూ చేసిన ఈమె బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది అక్కడ కూడా తన అందాల సోయగాలతో యువతకు గిలిగింతలు పెట్టింది.
మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మంట రాజేసి ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు చిలిపి పనులతో కూడా అందరిని అలరిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అసలు విషయంలోకి వెళితే వేసవికాలం అనగానే ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయలు, కొబ్బరి నీళ్లు ,తాటి ముంజలు.. వేడి తాకిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పకుండా వీటిని తీసుకోవాల్సిందే మరి ముఖ్యంగా చాలామంది తాటి ముంజలు తినడానికి ఇష్టపడతారు.
ఈ నేపద్యంలోని అషు రెడ్డి కూడా తాటి ముంజను చేతి బ్రోటన వేలుతో తీస్తూ వాటిని తింటుంది మీరు కూడా ఇలాగే తింటారా? మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం అంటూ ప్రశ్నిస్తోంది మొత్తానికైతే తాటి ముంజలు తింటూ ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది అంతేకాదు ఈమె విసిరిన ఈ ఛాలెంజ్ కి ఇప్పుడు అభిమానులు కూడా స్పందిస్తూ ఉండడం గమనార్హం.