తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులను ఎప్పటికీ మరచిపోలేము , వాళ్ళు పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా వాళ్ళు ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా, చెయ్యకపోయినా ఎప్పటికీ మనకి గుర్తు ఉంటారు. అలాంటి గుర్తించుకోదగ్గ క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరు హేమ. ఈమె అసలు పేరు కృష్ణ వేణి, తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం ఈమె స్వగ్రామం.తొలుత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చిన హేమ, ఆ తర్వాత లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది.

ఏమీ కామెడీ టైమింగ్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం కామెడీ టైమింగ్ మాత్రమే కాదు, ఇంటెన్స్ రోల్స్ కూడా అద్భుతంగా చెయ్యగలను అని ఆమె చాలా సినిమాల్లో నిరూపించుకుంది. సుమారుగా 200 సినిమాల్లో నటించిన ఈమె చివరగా పంజా వైష్ణవ్ తేజ్ మరియు క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ‘కొండపొలం’ అనే చిత్రం లో నటించింది.

2021 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె వెండితెర కి దూరమైంది. ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే హేమ, ఇలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. తనకి సంబంధించిన ఫోటోలు మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది.

అలాగే తన కూతురు ఈషా తో కలిసి సరదాగా గడిపిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె తన కూతురు తో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా అవి తెగ వైరల్ గా మారింది. ఈమెని చూస్తే అసలు హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం లాగా అనిపిస్తుంది .భవిష్యత్తులో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ, హీరోయిన్ గా వస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది అని మాత్రం చెప్పగలం.


