Nagashourya : ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి మద్దతుగా నిలచిన టాలీవుడ్ హీరో నాగశౌర్య.. ఇంట్రెస్టింగ్ పోస్ట్

- Advertisement -

Nagashourya : కొంతకాలంగా కన్నడ హీరో దర్శన్ పేరు మీడియాలో మార్మోగిపోతుంది. తన అభిమానిని హత్య చేశాడన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని ప్రియురాలు పవిత్రను రేణుకా స్వామి అనే వ్యక్తి వేధిస్తుండడంతో దర్శన్ అతనిని కొంత మందిని పెట్టి చంపించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసులో దర్శన్, పవిత్రలతో పాటు పోలీసులు మరో తొమ్మింది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తను తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా జైలులో ఉన్న హీరో దర్శన్ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఈ సంఘటనపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ.. అతనికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం దర్శన్‌కు మద్దతు ఇస్తూ తను ఇంతటి ఘోరానికి పాల్పడ్డడంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. అయితే ఇటీవల జరిగిన కేసు విచారణలో దర్శన్, రేణుకా స్వామిని తీవ్రంగా కొట్టి కరెంట్ షాక్ పెట్టి చంపుతుంటే పవిత్ర ఫుల్ ఎంజాయ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలిసిన వారంతా మనుషులు మరీ ఇంత దారుణంగా ఉంటారా అని షాక్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు కోలీవుడ్ వాళ్లే స్పందించారు కానీ తెలుగువారు దర్శన్ పట్ల స్పందించలేదు.

తాజాగా, టాలీవుడ్ హీరో నాగశౌర్య ఓ ఆసక్తికర పోస్టు పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ‘‘ఈ సంఘటనలో బాధితుడి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కష్టకాలంలో దేవుడు వారికి గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈ విషయం మీద జనాలు స్పందిస్తున్న తీరు నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దర్శన్ అన్న కలలో కూడా ఇలాంటి పనులు చేసే మనిషి కాదు. దర్శన్ అన్న గురించి తెలిసిన వారికి, ఆయన ఏంటో తెలుస్తుంది. వీలైతే తనకు చేతనైనంత సాయం చేసేందుకు దర్శన్ అన్న ముందుంటాడు.

- Advertisement -

ఎంతో మందికి ఆయనే ఆధారం.. దీన్ని నిజమని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మన న్యాయవ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ కాకున్నా రేపైనా నిజం బయటకు వస్తుందని ఆశిస్తున్నాను. బాధితుడి కుటుంబంతో పాటు మరో కుటుంబం కూడా ఈ వార్తల వల్ల ఇబ్బంది పడుతోందని అర్థం చేసుకోవాలి. వారికి ఈ కష్టకాలంలో కాస్త ఏకాంత సమయం, మనోధైర్యం అవసరం. అన్న దయా గుణం గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడని, నిజమైన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@actorshaurya)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here