Ambati Arjun : బుల్లితెర మీద పాపులారిటీ ని సంపాదించిన ఎంతో మంది నటులు సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా రాణించడం ఇది వరకు మనం ఎన్నో సార్లు చూసాము. ఈమధ్య అయితే సోషల్ మీడియా సెలెబ్రెటీలకు కూడా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి కూడా అవకాశాలు క్యూలు కడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అద్భుతమైన ఆటని ప్రదర్శిస్తూ టాప్ 6 కంటెస్టెంట్ గా నిల్చిన అర్జున్ అంబటి గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. అగ్ని సాక్షి సీరియల్ ద్వారా హీరోగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అర్జున్, ఆ తర్వాత పలు సీరియల్స్ లో హీరో గా నటించాడు.
అలాగే స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి చానెల్స్ లో పలు గేమ్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నాడు. సినిమాల్లో కూడా చేసాడు కానీ, పెద్దగా గుర్తింపు వచ్చే పాత్రలు చెయ్యలేదు. అయితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి సుకుమార్ సినిమాలో హీరో రోల్ ఎలా మిస్ అయ్యిందో చెప్పుకొచ్చాడు. సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా కార్తీక్ అనే దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. అయితే కార్తీక్ అర్జున్ అంబటి కి మంచి స్నేహితుడు. తొలుత అర్జున్ అంబటి ని హీరో పెట్టి విరూపాక్ష సినిమా చెయ్యాలని అనుకున్నాడట. ఆ సమయం లో ఈ చిత్రానికి ‘శాసనం’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.
కానీ కొత్త డైరెక్టర్, కొత్త హీరో, భారీ బడ్జెట్ అవ్వడంతో నిర్మాతలు ఎవ్వరూ కూడా ముందుకు రాలేదట. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ స్టోరీ సుకుమార్ రైటింగ్స్ వెళ్లడం, పలు మార్పులు చేర్పులు చేసి పెద్ద స్కేల్ లో ఆ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని అర్జున్ అంబటి చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత అయినా ఎదో ఒక పాత్ర ఆ సినిమాలో చెయ్యొచ్చు కదా అని యాంకర్ అడగగా, అప్పటికి నేను వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నానని, అందుకే ఈ చిత్రం లో ఎలాంటి పాత్ర చెయ్యలేదని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి ముందు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం లో జాలీ రెడ్డి పాత్రని కూడా అర్జున్ అంబటి వదులుకోవాల్సి వచ్చిందట. మరి అర్జున్ అంబటి టాలెంట్ కి తగ్గ గుర్తింపు భవిష్యత్తులో అయినా లభిస్తుందో లేదో చూడాలి.