Ariyana Glory : బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్లకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. హౌస్లో ఉన్నంత సేపు అవినాష్ తో స్నేహం చేసి బాగా పాపులర్ అయింది అరియానా గ్లోరీ. రామ్ గోపాల్ వర్మను జిమ్ లో ఇంటర్వ్యూ చేసి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది తెచ్చిన హైప్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించి.. ఆ షో ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకుంది. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలతో ఫోటో షూట్ లు చేస్తుంది ఈ చిన్నది. తాను పోస్ట్ చేసిన.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.

సోషల్ మీడియాలో ఫైర్ క్రియేట్ చేసిన అరియానా.. డిఫరెంట్ స్టైల్స్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఎంత హంగామా సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అరియానా గ్లామర్ షోతో రోజు రోజు హద్దులను చెరిపేస్తుంది. తన పాపులారిటీని పెంచుకునేందుకు స్కిన్ షోకు తెరలేపింది.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఎర్రటి చీరలో సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే షీ ఈజ్ వెరీ హాట్ అనిపించే విధంగా కనిపించింది. మత్తులో పడేసి కుర్రాళ్లు మనసులను దోచుకునే ప్రయత్నం చేసింది.

చేతిలో కొంగు పట్టుకుని ఇచ్చిన కొంటె ఫోజుతో కుర్రాళ్ల గుండెలను పిండేసింది. మరో ఫోటోలో కుక్క పిల్లలను ముద్దు చేస్తూ.. సో స్వీట్ అనేలా కనిపించింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై పలు షోలతో సందడి చేస్తూనే ఉంది అరియానా. ఈ క్రమంలో సోషల్ మీడియా కూడా హంగామా చేస్తోంది. ఆమె ఎప్పుడూ అక్కడ యాక్టివ్‌గా ఉంటుంది.. తన పోస్ట్‌లతో ఆకట్టుకుంటుంది.