విజయ్ దేవరకొండ గత కొంతకాలం నుండి కూడా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొడతారని చాలామంది భావించారు. ముఖ్యంగా విజయ దేవరకొండ ఫ్యాన్స్ ఫ్యామిలీ స్టార్ మూవీ హిట్ అవుతుంది అనుకున్నారు కానీ అందరికీ నిరాశే మిగిలింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ మూవీలో అలా చూపించడానికి ప్రయత్నం చేశారు దర్శకుడు, పాటలు సినిమా విడుదలకి ముందే హిట్ అవ్వడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అందరిలో విపరీతంగా పెరిగిపోయాయి, కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది ముఖ్యంగా కొన్ని సీన్స్ మీద నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకుడు మళ్ళీ గీతగోవిందం టెంప్లెట్ వాడడంతో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది సీన్స్ కూడా రిపీట్ అయినట్లు అందరికీ అనిపించాయి హీరో మిడిల్ క్లాస్ అని పెట్రోల్ కూడా చాలా పొదుపుగా వాడుకుంటాడు కానీ సొంతిల్లు ఉంటుంది సొంతింట్లో పైన హీరోకి ఒక సెపరేట్ గది ఉండడం ఇలా లాజిక్కులు కూడా లేవని చాలామంది ఫీలవుతున్నారు. మిడిల్ క్లాస్ అంటే పేరుకి మాత్రమే కదా ఎమోషన్స్ కూడా. అయితే అది మూవీలో సరిగ్గా చూపించలేదు కొన్ని సీన్స్ రాసుకున్న విధానం అయితే అసలు బాలేదు అని కామెంట్లు చేస్తున్నారు చూసిన
ఆడియెన్స్.
హీరోయిన్ హీరో మీద థెసిస్ రాయడానికి ఎందుకు వస్తుందో సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఆమెకి ఎలా దొరుకుతుందో కొంచెం క్లారిటీగా చెప్పి ఉంటే బాగుండేదని భావించారు చిన్న చిన్న విషయాలు మీద కూడా ఈ సినిమాలో కేర్ తీసుకోలేదు అని అందరికీ అనిపించింది. పేపర్ దోశ అన్నట్లు మూడు చుక్కల పిండితో హీరో దోస వేస్తాడు దాన్ని గ్రాఫిక్స్ లో చూపించలేక చచ్చారు.