Archana Shastry ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీనిపై అనేకమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కానీ, ఒక్కరు కూడా శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మీద మక్కువ వచ్చే తెలుగు అమ్మాయిలు అంటే ఇండస్ట్రీ లో చిన్న చూపు ఉంటుంది. ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా హీరోయిన్ ఆఫర్ దక్కాలంటే డైరెక్టర్లు, నిర్మాతలు కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. సంప్రదాయాలు, సంస్కృతి మధ్య పెరిగే తెలుగు అమ్మాయిలు వాటికి ఒప్పుకోకపోవడం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. అలాంటి వారిలో ఒకరు వేధా శాస్త్రి అలియాస్ అర్చన శాస్త్రి. ఈమె అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘నేను’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈమెకి అవకాశాలు వరుసగా క్యూలు కట్టాయి. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, పెద్దగా సక్సెస్ లు రాలేదు. ఆ తర్వాత ఈమెకి కన్నడ, తమిళం లో కూడా అనేక ఆఫర్లు వచ్చాయి. కానీ అనుకున్న స్థాయికి వెళ్లలేకపోయింది. ఇక ఆ తర్వాత సహాయ నటి పాత్రలు, నెగటివ్ రోల్స్ కి పరిమితమైంది. హీరోయిన్ గా ఎదిగేందుకు అన్నీ విధాలుగా అర్హతలు ఉన్న అర్చన శాస్త్రి ఇలా మిగిలిపోవడానికి కారణం కచ్చితంగా ఇండస్ట్రీ లో జరిగిన రాజకీయాలే అని రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ ఒక సినిమాలో నేను బాగా నటించినందుకు నాకు అవార్డు వచ్చింది. ఆ అవార్డుని ఒక స్టార్ హీరో చేత ఇప్పించాలని ఈవెంట్ మ్యానేజర్స్ అనుకున్నారు. ఇదే విషయాన్నీ ఆ హీరోకి చెప్పగా, ఈ అమ్మాయా?, ఈమెకి అయితే నేను అవార్డు అసలు ఇవ్వను అని చెప్పాడు. ఆ తర్వాత వేరే వాళ్ళతో ఆ అవార్డుని నాకు ఇప్పించారు’ అని చెప్పుకొచ్చింది అర్చన.
అంతే కాకుండా అర్చన మెయిన్ లీడ్ హీరో గా మలయాళం లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలోకి వచ్చాయి. అయితే మలయాళం లో మంచి పేరున్న హీరో అర్చన మీద మోజు పడ్డాడట. ఆమె నెంబర్ కనుక్కొని ప్రతీ రోజు ఆమెకి మెసేజిలు చేస్తూ వేధించేవాడట. ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం తో ఆగ్రహించిన ఆ హీరో, అర్చన ఒప్పుకున్న సినిమాలను క్యాన్సిల్ చేయించి ఆనందం పొందాడట. ఇలా మలయాళం లో స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన తనని తొక్కేసాడంటూ వాపోయింది అర్చన.