Anushka Shetty హీరోయిన్ గా, నవీన్ పొలిశెట్టి హీరోగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న కొత్త సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా లేట్ అవుతూ వచ్చింది. పలుమార్లు పోస్ట్‌పోన్ కూడా అయ్యింది. ఒక సమయంలో ఆడియన్స్ కూడా ఈ సినిమాని మర్చిపోయారు.

అయితే ఎట్టకేలకు రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 7న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. దీంతో మూవీ పై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ప్రమోషన్స్ మొత్తం నవీన్ పోలిశెట్టి మాత్రమే చూసుకుంటున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ లో టూర్ వేస్తూ మూవీని ప్రేక్షకులోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా కేవలం ఒక్కడే తన సినిమా కోసం కష్టపడుతున్నాడు.

హీరోయిన్ అనుష్క ఇప్పటి వరకు ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. రానున్న రోజుల్లో మూవీకి సంబంధించిన ఈవెంట్స్ లో కూడా అనుష్క కనిపించిందని టాక్ వినిపిస్తుంది. అనుష్క చివరిగా 2020లో ‘నిశ్శబ్దం’ సినిమా ప్రమోషన్స్ లో కనబడింది. అప్పటి నుంచి మళ్ళీ సినిమా విషయంలో బయట అసలు కనిపించలేదు. విషయం ఏదైనప్పటికీ ఒక ఈవెంట్ లో అయినా.. స్వీటీ కనిపిస్తే బాగుంటుంది అని ఆమె అభిమానులు కూడా చెబుతున్న మాట. మరి అనుష్క ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ లో అయినా కనిపిస్తుందా? లేదా? చూడాలి.