Prabhas తో అనుష్క తండ్రి భేటీ.. త్వరలోనే తీపి కబురు రాబోతోందా..?

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో Prabhas మొదటి స్థానం లో ఉంటాడు. నాలుగు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేసుకోకపోవడం పై సోషల్ మీడియా లో ఇప్పటి వరకు ఎన్నో ట్రోలింగ్ కామెంట్స్ వచ్చాయి. ప్రతి ఏడాది ప్రభాస్ పలానా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు, పలానా హీరోయిన్ తో డేటింగ్ ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో రూమర్స్ రావడమే కానీ, అవి నిజమై పెళ్లి చేసుకుంది మాత్రం ఇప్పటి వరకు లేదు.

Prabhas
Prabhas

తొలుత అనుష్క తో ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి, ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అంటూ వార్తలు రావడం మనం గమనించే ఉంటాం. ‘అన్ స్టాపబుల్’ షో లో బాలయ్య ఈ విషయంలో ప్రభాస్ తో ఒక ఆట ఆడుకుంటాడు.

వీటిల్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది కాసేపు పక్కన పెడితే, సోషల్ మీడియా లో ప్రభాస్ మరియు అనుష్క కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలు మరియు వీడియోలు ఎన్నో ఉన్నాయి. ప్రభాస్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కుటుంబ సభ్యులందరితో పాటు అనుష్క కూడా ఉంటుంది. వీళ్ళు మాత్రం మా మధ్య ఏమి లేదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా ప్రభాస్ అనుష్క అమ్మా నాన్నలతో కలిసి ఫోటోలు దిగడం, దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -

ఇన్నేళ్ల ప్రభాస్ సినీ కెరీర్ లో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ తో కలిసి పని చేసాడు ప్రభాస్, కానీ ఏ హీరోయిన్ తో కూడా ఆయన ఇంత క్లోజ్ గా ఉండలేదు. అలాంటిది అనుష్క కుటుంబం తో కూడా ఇంత మంచి సాన్నిహిత్యం ఉంది అంటే, కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో ఉంది అని చెప్పొచ్చు. వీళ్ళ రహస్య బంధం ఎప్పుడు బహిర్గతం అవుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here