Anushka Shetty : సౌత్ ఇండియా లో స్టార్ హీరోలకు సమానమైన స్టేటస్ ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున హీరో గా తెరకెక్కిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన అనుష్క శెట్టి, ఆ సినిమా తర్వాత వరుసగా క్రేజీ స్టార్ హీరోలతో నటిస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

అలా హీరోయి గా కొనసాగుతున్న రోజుల్లో ఆమెకి అరుంధతి అనే చిత్రం లో మెయిన్ లీడ్ పోషించే అవకాశం దక్కింది. ఈ సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, 38 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది.

ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. వాటిల్లో ‘భాగమతి’ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. బాలహుబలి సిరీస్ తర్వాత అనుష్క చేసిన ఈ సినిమాకి దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాలో అనేక సన్నివేశాలకు అనుష్క శెట్టి నే దర్శకత్వం వహించింది అట. ముఖ్యంగా చెయ్యి ని గోడకి ఆనించి శీల వేసి కొట్టుకోవడం వంటి ఐడియా లు అనుష్క నే ఇచ్చిందట.

అప్పట్లో ఈ ఫోజులో ఉన్న పోస్టర్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే డైరెక్టర్ అందుబాటులో లేని సమయం లో చాలా వరకు తన సన్నివేశాలకు తానే దర్శకత్వం చేసిందట. ఈ విషయం చాలా మందికి ఇప్పటి వరకు తెలియదు. అలా అనుష్క శెట్టి ఒక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆమెగా నిల్చింది.