స్వీటీ అనుష్క శెట్టి మాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఫస్ట్ టైమ్ ఓ మలయాళ మూవీ చేస్తుంది. 18 ఏళ్ళ కెరీర్ లో తెలుగు తమిళం మినహా పర భాషల వైపు కన్నెత్తి చూడలేదు అనుష్క. సింగం సిరీస్ సినిమాలతో బాలీవుడ్ లో నటించే అవకాశం వచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రావడం లేదన్న సంగతితెలిసిందే.
తెలుగులో నంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతోన్న టైమ్‌లో మలయాళం నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన మాలీవుడ్ సినిమాలు చేయనని చెప్పింది . తాజాగా ఇతర భాషా సినిమాల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్న అనుష్క తొలిసారి ఓ మలయాళ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథానార్ పేరుతో ఓ సూపర్ నాచురల్ హారర్ మూవీ చేయబోతోంది. యథార్థ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతోన్న ఈ హారర్ మూవీ లో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చ్ ఫాథర్ జీవితం నేపథ్యంలో ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం.
ఇందులో అనుష్క క్యారెక్టర్ అరుంధతి తరహాలో ఛాలెంజింగ్‌గా ఉంటుందని అంటున్నారు. మొత్తం పదిహేను భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. కథానార్ గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు. హారర్ అంశాలతో సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ వీడియో గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో గ్లింప్స్ ద్వారా అనుష్క ఈ మూవీలో నటించనున్న విషయాన్ని రివీల్ చేశారు. కథానార్ను ఫ్రాంచైజ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2024 లో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.