Sonusood : నా దయ వల్లే అనుష్క హీరోయిన్ అయ్యింది.. సోనుసూద్ సెన్సేషనల్ కామెంట్స్

- Advertisement -

Sonusood : అనుష్క శెట్టి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున సరసన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. కెరీర్ మొదట్లో కేవలం గ్లామర్ ను మాత్రమే నమ్ముకుని అవకాశాలు అందుకుంది. కానీ అరుంధతి సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని వెలికి తీసి టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వచ్చి నెగిటివిటీని ఫేస్ చేశారు కానీ.. అనుష్క మాత్రం నెగిటివిటీని కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంది. అందరి చేతఅనుష్క శెట్టి శభాష్​ అని అనిపించుకుంది.

గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనుష్క. ఆమె నటించిన ఆఖరి చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాతో ఆమె సక్సెస్ అందుకుని తన పునర్ వైభవం అందుకుంది. మంచి మంచి సినిమాలలో అవకాశాలు వస్తున్నా సరే ఎందుకో ఆమె చేయనంటూ ఆఫర్స్ రిజెక్ట్ చేస్తుంది. అయితే అనుష్క హీరోయిన్ అవ్వడానికి కారణం నేనే అంటూ ఓ స్టార్ నటుడు ఇంటర్వ్యూలో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మరెవరో కాదు రియల్ హీరో సోనూ సూద్.

- Advertisement -

“అనుష్క నేను ముంబైలో ఓకే జిమ్ లో వర్క్ అవుట్స్ చేసేవాళ్లం. అప్పటికే నేను ఇండస్ట్రీలో ఉన్నాను.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఫ్రెండ్షిప్ కూడా ఉంది . హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ధూమ్ సినిమాకు ఇంచుమించు అదే విధంగా ఉండే సినిమాను తెలుగులో తెరకెక్కించబోతున్నామంటూ చెప్పారు . అప్పుడే నన్ను నాగార్జున సెలెక్ట్ చేశారు . హీరోయిన్ కోసం కొత్త అమ్మాయి కావాలని చూస్తున్నట్లు తెలిపారు. అప్పుడే అనుష్క గురించి నేనే చెప్పాను.. నిజానికి నేను అప్పటివరకు అనుష్కతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. జిమ్ లో కనిపిస్తే స్మైల్ ఇచ్చేది. ఆ పాత్రకు తన సూట్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే జిమ్ ట్రైనర్ నుంచి ఆమె నెంబర్ తీసుకొని మరి పూరి జగన్నాథ్ గారికి చెప్పాను. ఆ తర్వాత ఆమె సినిమాలో సెలెక్ట్ అయింది. సూపర్ గా నటించింది నన్ను మించిన పెద్ద స్టార్ అయిపోయింది “అంటూ చెప్పుకొచ్చాడు సోను సూద్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here