Anupama Parameswaran : అందరు చూస్తుండగా ఆ యంగ్ డైరెక్టర్ కి రాఖీ కట్టి పరువు తీసేసిన అనుపమ పరమేశ్వరన్!

- Advertisement -

Anupama Parameswaran : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో అనుపమ పరమేశ్వరన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ స్మైల్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అలాంటి అనుపమ పరమేశ్వరన్ ని అందరు తమ ప్రేయసిగానో, లేదా భార్యగానో ఊహించుకుంటారు కానీ, ఎవ్వరూ కూడా అన్నయ్య గా, లేదా తమ్ముడిగా ఊహించుకోరు.

Anupama Parameswaran
Anupama Parameswaran

కానీ అనుపమ పరమేశ్వరన్ కార్తీక్ ఘట్టమేని అనే దర్శకుడిగా నిన్న అందరూ చూస్తూ ఉండగా స్టేజి మీద రాఖీ కట్టి కోలుకోలేని షాక్ ఇచ్చింది. పక్కనే ఉన్న రవితేజ మిల్క్ అందుకొని ‘ఏంటి కార్తీక్ ని అన్నయ్య ని పిలుస్తున్నావా.. వద్దు అలా పిలవొద్దు..నీ మంచి కోసమే చెప్తున్నా’ అని అంటాడు. అప్పుడు అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘నేను కార్తీక్ తో కలిసి నాలుగు సినిమాలు పని చేశాను. అతన్ని మొదటి నుండి అన్నయ్య అని పిలవడం అలవాటు. ఇప్పుడు ఆ అలవాటుని మార్చుకోలేని సారీ రవితేజ గారు’ అని సమాధానం ఇస్తుంది.

ఇక ఆ తర్వాత యాంకర్ సుమ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి రాఖీ తీసుకొని రాగ, అనుపమ పరమేశ్వరన్ రాఖీ కట్టేస్తుంది. ఇదంతా జరిగింది ‘ఈగల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. రవితేజ హీరో గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక ముఖ్య పాత్ర పోషించగా, కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

ఇప్పటికే టీజర్,ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా రేపు థియేటర్స్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా థియేటర్స్ సమస్య కావడం తో ఫిబ్రవరి 9 కి వాయిదా పడింది. ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here