Anupama Parameswaran స్టార్ హీరోయిన్ మాజీ భర్త తో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్..? మండిపడుతున్న నెటిజెన్స్!

- Advertisement -
Anupama Parameswaran యూత్ ఆడియన్స్ లో ఒక పెద్ద సూపర్ స్టార్ హీరోకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు అనుపమ పరమేశ్వరన్. తన సహజమైన నటనతో, చూపులు తిప్పుకోలేని హాట్ అందాలతో యువత మతులను పోగొట్టడం లో ఈ అమ్మడు దిట్ట. తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ, నటనకి అధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ వచ్చింది. రీసెంట్ గా ఆమె టిల్లు స్క్వేర్ చిత్రం లో లిల్లీ గా ఎంత అద్భుతంగా నటించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క్యూట్ గా నటించడమే కాదు, నెగటివ్ రోల్ లో కూడా అదరగొట్టగలను అని ఈ హాట్ బ్యూటీ ఈ చిత్రం ద్వారా నిరూపించింది.
Anupama Parameswaran
Anupama Parameswaran

ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలు, రీల్స్ ని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఈమెకి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండ్ అయిపోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా ఈమె గురించి ఒక పుకారు తెగ షికారు చేస్తుంది. అదేమిటంటే ఈమె ప్రముఖ గుజరాతీ నిర్మాత, యానిమేషన్ డైరెక్టర్ అయిన చిరంజీవి మక్వానా తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి మక్వానా గతం లో ప్రముఖ స్టార్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడా తో ప్రేమాయణం నడిపి, ఆమెతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.

Anupama Parameswaran Wallpaper 4K, Indian actress, South Actress

కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరి పెళ్లి పీటలవరకు వెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు అతనితోనే అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తుంది అని వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. నెటిజెన్స్ ఈ వ్యవహారం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుపమ పరమేశ్వరన్ కి ఇలాంటి రూమర్స్ కొత్తేమి కాదు. గతం లో హీరో రామ్ పోతినేని తో, అలాగే ప్రముఖ క్రికెటర్ బుమ్రా తో ఈమె డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్తలు నిజమో కాదో అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఇప్పుడు లేటెస్ట్ ఈ గాసిప్ కూడా అదే కోవకి చెందనుందా?, లేదా ఇది నిజామా అబద్దమా అనేది అనుపమ క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.

- Advertisement -

Anupama Parameswaran's cute reaction to 'Netru Varai' song in 'Siren' goes viral | Tamil Movie News - Times of India

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here