Sai Srinivas : ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు సెలబ్రెటీస్ అంతా పెళ్లి బాట పట్టారు. పెళ్లి చేసుకుని బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి… లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోహీరోయిన్లు, ప్రముఖ ఆర్టిస్టులు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలవుతుండగా ఇప్పుడు అదే లిస్టులోకి చేరిపోతున్నారు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ సెకండ్ బ్యాచిలర్.

ఆయన మరెవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . పేరు వెనుక బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. సినిమా ఇండస్ట్రీకి బెల్లంకొండ అనే పేరు ఎన్ని తరాలుగా ముందుకు వెళ్తుందో మనం చూస్తునే ఉన్నాం. కాగా సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించిన ఆయన క్రేజ్ దక్కించుకోలేకపోయాడు. బాలీవుడ్లో సైతం ట్రై చేసినా ఫలితం దక్కలేదు.

ఈ క్రమంలోనే ఆయన తన పెళ్లి విషయంపై దృష్టి కేంద్రీకరించాడట. కాగా గత కొంతకాలంగా ఓ హీరోయిన్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త వైరల్ అవుతోంది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నాడట. ప్రస్తుతం ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.