Raj Tarun : రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. హీరోయిన్ అకౌంట్ లో మరో ఎఫైర్..

- Advertisement -

Raj Tarun హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వీ మల్హోత్రా ఈ పేర్లు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. లావణ్య రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది.. నిన్న లావణ్య కు రాజ్ తరుణ్ మేనేజర్ ఫోన్ చేసి డబ్బులను ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ మాల్వి కేసులో మరో ట్విస్ట్ బయట పడింది..

Raj Tarun Lavanya
Raj Tarun Lavanya

ఈ కేసులోకి మరో కొత్త పాత్ర ఎంట్రీ ఇచ్చింది.. తన కుమారుణ్ని ట్రాప్‌ చేసి, మాల్వీ ఆస్తి కాజేసిందని ముంబై నిర్మాత యోగేశ్‌ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.. అందులో మాల్వి కాల్ లిస్ట్ ను కూడా బయట పెట్టింది. యోగేశ్‌ ముంబైలో ఓ చిన్న నిర్మాత. తన చిత్రంలో నటించడానికి వచ్చిన మాల్వీతో ప్రేమలో పడ్డారు యోగేశ్‌. వీళ్లిద్దరూ రెండేళ్లు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, తనని పెళ్లి చేసుకోవడానికి యోగేశ్‌ నిరాకరించాడనీ, కత్తితో తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడనీ ఆరోపిస్తూ మాల్వీ కేసు పెట్టడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు..

- Advertisement -

తన కొడుకుపై మాల్వి తప్పుడు కేసులు పెట్టిందని మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. అంతేకాదు రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో మాల్వీ ఇన్‌వాల్వ్‌ అయిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నాననీ, అందుకే మాల్వీ బండారం బయటపెట్లాలని వీడియో విడుదల చేస్తున్నాననీ, తన కొడుకు ఇంకా జైలులోనే ఉన్నాడనీ, మాల్వీ అతని కెరీర్‌ను సర్వనాశనం చేసిందని ఆమెను అస్సలు వదలొద్దని వీడియోలో చెప్పుకొచ్చింది.. మరి పోలీసులు ఆమె పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here