Anjali : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్యూటీ క్వీన్ ‘రాధిక’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఇటీవల చాలా గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు నటసింహం బాలయ్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషించిన అంజలి కూడా ఈ వేడుకలో భాగమైంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ అంజలిని అందరిముందే స్టేజ్‌పై నెట్టాడు. అయితే ఈ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం అయింది. బాలయ్య తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో పలువురు బాలయ్య చేసిన పనికి అంతా మండిపడుతున్నారు.
తాజాగా, ఈ వివాదంపై అంజలి స్పందించింది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని తన సమక్షంలో ఘనంగా నిర్వహించినందుకు బాలయ్య గారికి ధన్యవాదాలు. బాలకృష్ణ గారు, నేను ఒకరిపట్ల ఒకరికి పరస్పర గౌరవాన్ని కలిగి ఉన్నాం. చాలా కాలం నుండి మేం గొప్ప స్నేహాన్ని షేర్ చేసుకుంటున్నట్లు నేను తెలియజేస్తున్నాను. ఆయనతో మరో సారి వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా బాలయ్య తనను తోసేసిన వీడియోను మరో సారి షేర్ చేసింది. అందులో వారు సరదాగా మాట్లాడుకుంటూ అలా నెట్టిన తర్వాత కూడా ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు. దీంతో వివాదానికి చెక్ ఇకతో పడినట్లు అయింది. ప్రస్తుతం అంజలి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అసలు విషయం ఇదా అని నిట్టూరుస్తున్నారు. ఇక బాలయ్య అభిమానులు మాత్రం అక్కడ ఏం జరిగిందో తెలియకుండా అలా నోరు పారేసుకున్నారు ఇప్పటికైనా కళ్లు తెరవండి అంటూ ఆగ్రహిస్తున్నారు.
View this post on Instagram