Animal : ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ లో కొన్ని బాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాలు హైదరాబాద్ వంటి సిటీస్ లో స్టార్ హీరో రేంజ్ గ్రాస్ వసూళ్లను సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు కేవలం తమిళ సినిమాలం లో ఉన్న కొంత మంది స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే మన టాలీవుడ్ లో ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు మంచి హైప్ ఉంటే చాలు, మన తెలుగు ఆడియన్స్ దుమ్ము లేపే రేంజ్ ఓపెనింగ్స్ ని ఇచ్చేస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీస్ లలో స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్స్ ని ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు, బాలీవుడ్ మార్కెట్ మన టాలీవుడ్ లో ఎలా పెరిగింది అనడానికి. ఉదాహరణకి ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించిన ‘బ్రో ది అవతార్’ చిత్రానికి హైదరాబాద్ లో విడుదలకు ముందు 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అయితే ‘ఎనిమల్’ చిత్రానికి కూడా అదే రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. కానీ బ్రో చిత్రం కంటే 200 షోస్ అధికంగా ఉండడం వల్లే ఎనిమల్ కి ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని ప్రతీ ప్రాంతం లో కూడా ఓపెనింగ్స్ అదరగొట్టింది ‘ఎనిమల్’ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 13 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు.

అంటే షేర్ దాదాపుగా 7 నుండి 8 కోట్ల రూపాయిలు అన్నమాట. ఓవరాల్ మొదటి రోజు అన్నీ భాషలకు కలిపి ఈ చిత్రానికి 114 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండవ రోజు కూడా అన్నీ ప్రాంతాలలో దాదాపుగా అదే స్థాయి వసూళ్లు వచ్చాయట, చూస్తూ ఉంటే తెలుగులో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.
