Tripti Dimri : యానిమల్ బ్యూటీ జోరు మామూలుగా లేదుగా.. స్టార్ హీరో ఇంటి పక్కనే కొత్త ఇల్లు

- Advertisement -

Tripti Dimri : త్రిప్తి దిమ్రి ఈ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతుంది. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అమ్మడు హాట్ ఫేవరేట్. ఇండస్ట్రీకి చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన అ ముద్దుగుమ్మ వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంది. కానీ యానిమల్‌తో ఒక్కసారిగా ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమాలో రణ్‌బీర్, రష్మిక హీరో హీరోయిన్‌లుగా నటించగా.. తృప్తి దిమ్రి కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల కంటే ఈ అమ్మడికే ఎక్కువ ఫాలోయింగ్, గుర్తింపు వచ్చింది. ఇప్పుడు హిందీలో తృప్తికి వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ చేతినిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంది.

తెలుగులోను భారీ బడ్జెట్‎తో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌కు ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే ఫుల్ జోష్ లో ఉన్న ఈ అమ్మడు.. ఇటీవల ముంబైలో భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్న సామెతను ఈమె బాగా ఫాలో అవుతుందట. ప్రస్తుతం ప‌లు సినిమాలతో బిజీగా త్రిప్తి ముంబైలో స్టార్ సెలబ్రిటీలు ఉండే బాంద్రా ఏరియాకు తన మకాం మార్చిందని తెలుస్తోంది.

- Advertisement -

రణ్‌బీర్ కపూర్‌, ఆలియా భ‌ట్, సల్మాన్, షారుక్ ఖాన్ లాంటి అగ్రతారలు నివసించే బాంద్రా ఏరియాలోని రెండు అంతస్తుల బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. సుమారు 257 గజాలు విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు దాదాపు రూ.14 కోట్ల వరకు ఉంటుందట. ఇప్పటికే స్టాప్ డ్యూటీ కిందే ఏకంగా రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్‌కు రూ. 30 లక్షలు ఇచ్చిందట. ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మామ్ పోస్టర్, బాయ్స్, లైలా మజ్ను లాంటి సినిమాలో ఆకట్టుకుంది.. కానీ బుల్బుల్ సినిమాతో ఫేమస్ అయినా త్రిప్తి యానిమల్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here