Hi Nanna : ప్రస్తుతం ఒక సినిమాకి కలెక్షన్స్ రావాలంటే కచ్చితంగా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. పాటలు ఒకటి లేదా రెండైనా సూపర్ హిట్ అవ్వడం తప్పనిసరి, అదే సమయం లో జానర్ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ పర్ఫెక్ట్ గా కలిసి వస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని రేంజ్ వసూళ్లు వస్తాయి. లేకపోతే మొదటి రోజు మొదటి ఆట నుండే పూర్ ఓపెనింగ్స్ దక్కుతాయి, నిన్న విడుదలైన ‘హాయ్ నాన్న’ చిత్రం అందుకు ఉదాహరణ.
ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ ఓవర్సీస్ లో తప్ప అన్నీ ప్రాంతాలలో దారుణమైన వసూళ్లు వచ్చాయి. నాని గత చిత్రం ‘దసరా’ కి మొదటి రోజు దాదాపుగా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. కానీ ‘హాయ్ నాన్న’ చిత్రానికి మాత్రం కేవలం 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
అంటే ‘దసరా’ తో పోలిస్తే 5 రెట్లు తక్కువ వసూళ్లు అన్నమాట. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి నాని ఫ్యాన్స్ లో అసంతృప్తి చాలా బలంగా ఉండేది. ఎందుకంటే ‘దసరా ‘ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నాని తదుపరి చిత్రాలు మొత్తం అదే రేంజ్ భారీ సినిమాలు ఉంటాయని ఆశించారు. కానీ ‘దసరా’ తో వచ్చిన ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ఈ సినిమా తియ్యడం వల్ల కావాల్సిన హైప్ రాలేదు.
విచిత్రం ఏమిటంటే, ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ‘ఎనిమల్’ 7 వ రోజు వసూళ్లు ‘హాయ్ నాన్న’ మొదటి రోజు వసూళ్లకంటే ఎక్కువ వచ్చాయట. అంటే దాదాపుగా ఎనిమల్ నిన్న రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది అట. నైజాం వంటి ప్రాంతాలలో ‘హాయ్ నాన్న’ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. అయితే టాక్ బాగుంది కాబట్టి హాయ్ నాన్న చిత్రానికి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.