Anil Vishwanath : చిరంజీవితో సినిమా తీయాల్సిన అవసరం నాకు లేదన్న పొలిమేర-2 దర్శకుడు.. దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..!

- Advertisement -

Anil Vishwanath : ఏ అంచనా లేకుండా ‘పొలిమేర’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్ టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేసిన ‘పొలిమేర’ క్లైమాక్స్‌లో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్‌కు దీని సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూడడం మొదలుపెట్టాడు. తాజాగా విడుదలయిన సీక్వెల్ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు.

Anil Vishwanath
Anil Vishwanath

అలా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టాడు. ‘పొలిమేర 2’తో చిరంజీవి చేత ప్రశంసలు పొందే అవకాశం తనకు దక్కలేదని, ఆయన పిలుపు అందాలంటే ఇంకా పెద్ద బ్లాక్‌బస్టర్ కొట్టాలని అనిల్ చెప్పుకొచ్చాడు. అంత అభిమానం ఉన్నందుకు ఒకవేళ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలాంటి జోనర్ సినిమా తీస్తారు అంటే ఆయనతో నేను సినిమా తీయలేను అని సూటిగా సమాధానం ఇచ్చాడు. అదేంటి అని అడగగా.. ‘‘ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు బాగుంది, బాలేదు అని చెప్పాలి. ఆయన ఏం చేసినా నాకు బాగుంటుంది. నేను జడ్జ్ చేయలేను’’ అని చెప్పాడు అనిల్. ఒకవేళ చిరంజీవినే వచ్చి చేయమని చెప్పినా.. చేయను అని అంటానని తెలిపాడు.

మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్‌లో చాలామంది దర్శకులకు, హీరోలకు అభిమానం. అంతే కాకుండా ఆయననే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చినవారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ‘పొలిమేర 2’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్‌కు కూడా చిరంజీవి అంటే చాలా అభిమానమని, చూస్తే ఎమోషనల్ అయిపోతానని బయటపెట్టాడు. తనకు చిరు అంటే చాలా ఇష్టమని, బయట కలిసే అవకాశం వచ్చిన చాలాసార్లు కలవలేదని అన్నాడు. చిరంజీవిని కలిసినప్పుడు తనకంటూ స్థాయి ఉండాలని, ఆయన చేత మంచి సినిమా తీశానని చెప్పించుకోవాలని, ఒకవేళ అలా చెప్తే.. అదే తన ఆఖరి సినిమా కూడా అవ్వవచ్చని, ఇంక సినిమాలు తీయడం ఆపేస్తానేమో అని చెప్పాడు అనిల్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here