మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక్క వాల్తేర్ వీరయ్య తప్ప మరింకే సినిమా సక్సెస్ అందుకోలేక పోతుంది. ఆచార్య ,గాడ్ ఫాదర్ రీసెంట్ గా విడుదలైన భోళా శంకర్..ఇలా ఈ మూడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ పరంగా అభిమానులు కూడా మెగాస్టార్ ఇప్పటికైనా మూవీ స్టోరీ గురించి కాస్త ఆలోచిస్తే బెటర్ గా ఉంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన లూసిఫర్ చిత్రాన్ని గాడ్ ఫాదర్ గా తీసి ఒకసారి ఫెయిల్ అయిన చిరంజీవి తిరిగి తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదళం కాన్సెప్ట్ తోనే భోళాశంకర్ చిత్రాన్ని తీయడం ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రస్తుతం చిరంజీవి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరొక విషయం కూడా మెగా ఫాన్స్ ను ఆగ్రహానికి గురిచేస్తుంది.

మెగాస్టార్ రెమ్యూనరేషన్ కోసం చిత్ర నిర్మాత అనిల్ సుంకర పై ఒత్తిడి చేస్తున్నారు అనే ఒక పుకారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటువంటి హానికారకమైన పుకార్లు కేవలం పోస్టులు వైరల్ చేయడం కోసం కొందరు కావాలని సృష్టించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయం గురించి ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రకటన జారీ చేయడం జరిగింది. అయినా ఇంకా ఈ పుకార్లు తగ్గకపోవడంతో తాజాగా నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయంపై స్పందించారు.
ఇటువంటి నిరాధారమైనటువంటి పుకార్లు సృష్టించడం వల్ల కొంతమంది పైశాచిక వినోదాన్ని పొందుతున్నారని.. ఆ పుకార్లకు రియాక్ట్ అయి అటువంటి వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనవసరమని ఆయన పేర్కొన్నారు. కానీ ఇలాంటి పుకార్ల కారణంగా వీటితో ఎటువంటి ప్రమేయం లేని కొన్ని కుటుంబాలు విపరీతమైన ఒత్తిడికి ఆందోళనకు గురి అవుతున్నాయని ఆయన అన్నారు. చిరంజీవి పై వస్తున్నటువంటి పుకార్లను అనిల్ సుంకర తీవ్రంగా ఖండించారు. ఇలా సంవత్సరాలు తరబడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను వినోదం కోసం వీధిలో పెట్టడం సబబు కాదని ఆయన అన్నారు.