Andrea Jeremiah : స్టార్ హీరోయిన్ ఆండ్రియా టీషర్టులో చేతులు పెట్టిన కేటుగాడు.. తర్వాత ఏమైందంటే ?

- Advertisement -


Andrea Jeremiah : టాలీవుడ్ ఇటు టాలీవుడ్‌తో పాటు ప్లే బ్యాక్ సింగర్‌గా, హీరోయిన్ గా పాపులరిటీ సంపాదించుకుంది ఆండ్రియా. నిత్యం ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. అలాంటి ఆండ్రియా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది.. తన జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటన గురించి పంచుకుంది. ఆండ్రియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లైంగిక వేధింపుల గురించి తన చెత్త అనుభవాల గురించి చెప్పింది.

ఆమె మాట్లాడుతూ.. ఈ ముద్దుగుమ్మ 2005లో తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. గౌతమ్ నందా దర్శకత్వంలో నటించి పాటలు కూడా పాడింది. తమిళంతో పాటు తెలుగులోనూ పదుల సంఖ్యలో సూపర్ హిట్ పాటలు పాడి అందరినీ అలరించింది. బొమ్మరిల్లుతో మొదలుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో కూడా హిట్ పాటలు పాడింది.

Andrea Jeremiah

ఆమె ఎక్కువగా తమిళ పరిశ్రమకే పరిమితమైంది. అయితే సింగర్ గా, హీరోయిన్ గా ఉన్న ఆండ్రియాకు గొడవలకు కొదవలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమాయణం నడిపింది. నటుడితో సన్నిహిత సంబంధం వంటి ఎన్నో వివాదాలకి దిగింది. ఇక ప్రస్తుతం కొన్ని షాకింగ్ విషయాలను ఆండ్రియా బయట పెట్టింది. ఇంకొకసారి హాట్ టాపిక్ మారింది ఈ ముద్దుగుమ్మ. ఆండ్రియా మాట్లాడుతూ.. ‘‘ అప్పట్లో నా వయసు 11 సంవత్సరాలు. నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను. నేను జీన్స్-టీ షర్ట్ మాత్రమే ధరించాను.

- Advertisement -

మా నాన్న నా పక్కనే కూర్చున్నాడు కానీ నాకు మాత్రం నా టీ షర్ట్‌ లోపల ఎవరో చేయి వేసినట్లుగా అనిపించింది. అక్కడ మాత్రం ఎవరు లేరు. అయితే నా టీ షర్ట్‌లో ఎవరో చేయి పెట్టారన్నది పక్కన పెడితే.. అలాంటి ఊహను కూడా నేను తట్టుకోలేకపోయాను. చాలా భయపడిపోయాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా భయపడి పోయాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ అక్కడే ఏడుపు మొదలుపెట్టాను. ఆ తర్వాత వెళ్లి మా అమ్మ దగ్గర కూర్చున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో పడ్డానని చెప్పాడు. కానీ ఇప్పుడైతే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పాడు. ప్రస్తుతం ఆండ్రియా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ అమ్మడు ఈ మధ్య వెంకటేష్ సైంధవ్ మూవీలో కీలక పాత్రలో నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here