Anchor Varshini : పటాస్ షోతో బుల్లి తెరకు పరిచమైన సుందరాంగి వర్షిణి. ప్రస్తుతం వరుస షోలకు హోస్టింగ్ చేస్తూ తెలుగులో పాపులర్ యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఢీ షోతో హాటెస్ట్ యాంకర్ గా వర్షిణి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్లను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. దాంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ముద్దుగుమ్మ. నిరంతరం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

అంతలా బుల్లి తెరపై పాపులర్ అయిన వర్షిణి ఇటీవల ఓ ఇంటర్వ్యూ కు హాజరైంది. ఆ క్రమంలోనే తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపింది. లాక్ డౌన్ కు ముందు తను ఓ ఆఫర్ వచ్చిందని పేర్కొంది. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం ఓ డైరెక్టర్ హోటల్ కు ఆడిషన్ నిమిత్తం రమ్మని కబురు చేయడంతో అక్కడికి వెళ్లి కలిసినట్లు తెలిపింది. వెళ్లగానే తను నువ్వు బాగున్నావు. నా వెబ్ సిరీస్ కు సూట్ అవుతావని చెప్పి.. గదిలోకి రమ్మని వెళ్లగానే చెయ్యిపట్టుకుని బెడ్డు పైకి లాగి.. నా డ్రస్ విప్పమని అడిగాడని చెప్పింది.

దీంతో వెంటనే భయపడి బయటికి వెళ్లి వచ్చి కారులో కూర్చుని చాలా సేపు ఏడ్చానని.. ఇది తన జీవితంలో చాలా చేదు అనుభవంగా వర్షిణి పేర్కొంది. ప్రస్తుతం వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజులుగా వర్షిణికి హైపర్ ఆది తో పెళ్లి అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆదికి ఆమెతో మంచి స్నేహం కూడా కుదిరిందని చాలా వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే థంబ్ నెయిల్స్ తో వారి సంబంధాన్ని ఊదరగొట్టాయి. కానీ ఇందులో నిజం లేదని అవన్నీ పుకార్లని తెలుస్తోంది. వర్షిణి పెళ్లి ఓ డైరెక్టర్ తో అని టీవీ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. తను మల్లెమాలలో క్రియేటివ్ డైరెక్టర్ గా చేస్తున్న మణికంఠ అని ప్రచారం జరుగుతోంది. పని చేస్తున్నాడు. ఇప్పుడు మణికంఠ, వర్షిణి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఓ చర్చ అయితే ఉంది. మరి ఈ వార్తలోనైనా నిజం ఎంతుందో చూడాలి.