Anchor Suma : బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా సుమ కి ఎంత మంచి పేరుందో మన అందరికీ తెలిసిందే. మన చిన్నతనం నుండి ఈమె యాంకరింగ్ చూస్తూనే ఉన్నాం. రోజంతా కష్టం చేసి వచ్చి కాసేపు సుమ యాంకర్ గా వ్యవహరించే షో ని చూసి ఉపశమనం పొందడానికి ఆడియన్స్ ఇష్టపడుతారు. ఎందుకంటే ఆమె యాంకరింగ్ అంత ఫన్ గా ఉంటుంది, ముఖ్యంగా టైమింగ్ తో ఆమె వేసే పంచులు అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.

అయితే ఎంతటి స్టార్ యాంకర్ కి అయినా, ఒక స్టేజి దాటిన తర్వాత మునుపటి రేంజ్ వైభోగం ఉండదు. అప్పటి పెర్ఫార్మన్స్ కి ఇప్పటి పెర్ఫార్మన్స్ కి చాలా తేడా వచ్చేస్తుంది. యాంకర్ సుమ విషయం లో కూడా అదే జరుగుతుంది. ఆమె పంచులు ఈమధ్య సరిగా పేలడం లేదు, చాలా రొటీన్ అనిపిస్తున్నాయి. అంతే కాకుండా కామెడీ కోసం ఆమె చేస్తున్న కొన్ని ప్రయత్నాలు బ్యాక్ ఫైర్ అయ్యి సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి గురి అయ్యేలా చేస్తుంది.

ఇక అసలు విషయానికి సుమ కొడుకు రోషన్ ‘బబుల్ గమ్’ అనే సినిమా ద్వారా మన టాలీవుడ్ కి హీరో గా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రొమోషన్స్ లో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈటీవీ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘సుమా అడ్డా’ అనే ప్రోగ్రాం కి రోషన్, హీరోయిన్ మానస చౌదరి తో పాటుగా రాజీవ్ కనకాల కూడా వచ్చాడు.

ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23 వ తారీఖున టెలికాస్ట్ కాబోతుంది. ఈ ఎపిసోడ్ లో సుమ మరియు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ ముందు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడడం, సరసాలు ఆదుకోవడం వంటివి చూసే ఆడియన్స్ కి చాలా చిరాకుగా అనిపించింది. ఎంత మూవీస్ ప్రొమోషన్స్ అయితే మాత్రం కొడుకు ముందు ఇలా ప్రవర్తిస్తారా అంటూ నెటిజెన్స్ సుమ మరియు రాజీవ్ కనకాల పై చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.