Anchor Suma : బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా సుమారు రెండు దశాబ్దాల నుండి నెంబర్ 1 సాగుతుంది ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుమ కనకాల. యాంకరింగ్ రంగం లో ఈమెని మించిన స్టార్ ఇంకా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలన్న సుమ డేట్స్ కావాల్సిందే. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో ఆయన పాత్ర ఆటోమేటిక్ గా ఉండాల్సిందే. ఈమధ్య వెబ్ సిరీస్ లలో కూడా కనిపిస్తున్నాడు. ఇలా వీళ్లిద్దరి సంగతి ఎక్కువసేపు మాట్లాడనవసరం లేదు, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ దంపతుల కుమారుడు రోషన్ సినిమాల్లో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన మొదటి చిత్రం ‘బబుల్గమ్’ థియేటర్స్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమాతోనే లిప్ లాక్ సన్నివేశాలు, అడల్ట్ డైలాగ్స్..అబ్బో కుర్రాడిలో మాములు స్టఫ్ లేదే అని అనిపించేలా చేసాడు. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా సుమ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన పిల్లల గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది.

ఆమె మాట్లాడుతూ ‘చాలా మంది తల్లిదండ్రులు తాము చనిపోతే మా పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆందోళన చెందుతూ ఉంటారు. వారి కోసం ఇన్సూరెన్స్ లు కూడా చేయించి పెడుతారు. కానీ వాటి గురించి పిల్లలకు తెలియాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. అందుకే నా పిల్లలకు నేను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా వివరించి చెప్పాను. ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు అమ్మా అని మా పిల్లలు అన్నారు. కానీ వాటి గురించి తెలియకపోతే చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది.’ అంటూ చెప్పుకొచ్చింది సుమ.
