Anchor Suma గురించి ఎంత చెప్పుకున్న కూడా ఏదోకటి మిగిలే ఉంటుంది.. ఈమె యాంకరింగ్ అంటే జనాలు చెవులు కోసుకుంటున్నారు.. ఏ షోలో అయిన సుమ కనిపిస్తే చాలు చూస్తూ ఉండిపోతారు.. ఇక సినిమాల ఫంక్షన్ లు, ఈవెంట్లు ఉంటే సుమ హోస్టింగ్ ఉండాల్సిందే.. ఆమె తో హోస్టింగ్ చేయించిన ఈవెంట్స్ సక్సెస్ అవ్వడంతో అందరూ ఆమెనే కావాలని అనుకుంటున్నారు..తన మాటలతో.. చలాకీ తనంతో ఎలాంటి ఈవెంట్ నైనా సుమ అవలీలగా హ్యాండిల్ చేయగలదు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుమ పై సీరియస్ అయిన విషయం తెలిసిందే.. అది సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే.. ఇప్పుడు సుమ ఎన్టీఆర్ కు కౌంటర్ వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు తారక్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సుమ తారక్ ను మాట్లాడమని కోరుతూనే ఎన్టీఆర్ 30 అప్డేట్ గురించి అభిమానులు అడుగుతున్నారు అంటూ చెప్పింది. దానికి తారక్ ఓ సీరియస్ లుక్ ఇచ్చాడు. వాళ్లు కాదు ముందు మీరే అడుగుతున్నారు అని అన్నారు తారక్. అయితే సుమ భర్త రాజీవ్ కనకాలకు తారక్ కు మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే..ఇది ఇలా ఉండగా తాజాగా.. విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన తారక్ సుమకు ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు నందమూరి హీరో. తారక్ ను ఇన్వైట్ చేస్తున్న సమయంలో తారక్ ఆమెను చూసి నేను నిను చూడను తల్లీ అంటూ సైగలు చేశారు.
దానికి వెంటనే సుమ చూడు తారక్ చూడు అంటూ రియాక్ట్ అయ్యింది. ఈ ఫన్నీ కన్వర్జేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తారక్ పర్లేదు చూడు అనడంతో చూసాడు.. ఇక నిన్న జరిగిన ధమ్కీ ఈవెంట్ లో తారక్ అద్భుతంగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవడం గురించి ఆయన వివరించారు. స్టేజ్ పై చంద్రబోస్ , కీరవాణి ఇద్దరు నిలుచుంటే నాకు ఇద్దరు భారతీయులు మాత్రమే కనిపించారు అని అన్నారు.. ఎన్టీఆర్ మాటలు ఆకట్టుకున్నాయి.. మొత్తానికి ఈవెంట్ లో ఎన్టీఆర్ హైలెట్ అయ్యాడు.. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.. ఎన్టీఆర్ కు సుమ వేసిన పంచులకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..