Anchor Suma : యాంకర్ సుమ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో.. ఇంట్లో సుమ మాట వినిపించని రోజు ఉండదేమో.. తెలుగు వారికి అంతలా కనెక్ట్ అయిపోయింది సుమా.. ఎప్పుడు షోలతో బిజీగా ఉంటూ ప్రతిరోజు టీవీలో కనిపిస్తూ ఇంట్లో ఓ మనిషి లాగే చాలామంది ఫీలవుతుంటారు.. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్న ఎంతోమందికి ఓ డిక్షనరీ అనుకోవచ్చు..
సుమ ఈవెంట్స్ లో మైక్ పట్టుకొని ఎంత పెద్ద స్టార్ ని అయినా ఈజీగా డీల్ చేస్తుంది.. ఆడియన్స్ ని నవ్విస్తూ అట్రాక్ట్ చేస్తుంది.. కాంట్రవర్సీల జోలికి అసలు వెళ్ళనే వెళ్ళదు వెళ్లి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది.. ఇదంతా ఒకప్పుడు అంటున్నారు నేటిజన్స్.. ఇటీవల సుమ యాంకరింగ్ గాడి తప్పుతుందని కొందరు అంటున్నారు.
కళ్యాణ్ రామ్ అమీగోస్ ప్రీ రిలీజ్ వేడుకకి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ ను.. తన 30వ సినిమా అప్డేట్ కోసం అభిమాన్స్ వెయిట్ చేస్తున్నారని అంటూ ఎన్టీఆర్ చేతిలో మైక్ పెట్టింది సుమ.. వాళ్ళు అడిగారా లేదో కానీ నువ్వే అన్ని చెప్పేటట్లు ఉన్నావ్ అని ఎన్టీఆర్ సుమకి స్మాల్ సెటైర్ కూడా వేశాడు.. కానీ సుమ ఆ మాటలను విని విననట్టుగా ఉండిపోయింది.. దాంతో నేటిజన్స్ సుమని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.
ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఉండగా.. SSMB29 సినిమా గురించి మాట్లాడి ఆగ్రహానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు స్పీచ్ లో కూడా సుమా మధ్యలో కల్పించుకుంది.
అలాగే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో రచ్చ రవి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. సుమ ఆ మాటలను పక్కదారి పట్టించి విమర్శలకు దారితీసింది.. యాంకర్ సుమ ఇలా వరుస వివాదాలతో చిక్కుకోవడం వల్ల.. సుమ యాంకరింగ్ శృతి తప్పుతుందని పలువురు నెటిజన్స్ చెబుతున్నారు. అయినా కానీ సుమ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గౌరవిస్తూనే ఉంటారు. ఎక్కడ బల్గారిటీ లేకుండా ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తుంది అనడంలో సందేహం లేదు.