Rashmi Gautam : షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ కు యాంకర్ రష్మీ గుడ్ బై

- Advertisement -

Rashmi Gautam గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ‘జబర్దస్త్’ షోలో యాంకర్‌గా మారి ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తూ తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. జంతు ప్రేమికురాలైన రష్మీ గౌతమ్.. మూగజీవాలను హింసిస్తే చూస్తూ ఊరుకోదు. ఆ అంశాలపై ఆమె చేసిన ట్వీట్లు చాలా వివాదాలకు కారణమైన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలను కాసేపు పక్కన పెడితే.. ‘జబర్దస్త్’ షోకు తాను గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Rashmi Gautam
Rashmi Gautam

తొలుత ‘జబర్దస్త్’ యాంకర్‌గా కొనసాగిన అనసూయ షో నుంచి తప్పుకుంది. కొత్త యాంకర్‌ని తీసుకురావాలని షో నిర్వాహకులు భావించారు. కానీ, అప్పట్లో కొత్త యాంకర్‌ని సెట్ చేయడం కుదరలేదు. దీంతో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ యాంకర్‌గా ఉన్న రష్మీనే ఈ షోకి యాంకర్‌ని చేసేశారు. ఆమె రెండు షోలకు యాంకరింగ్ చేసి మంచి పేమెంట్‌ను పొందింది. కొన్ని రోజులుగా రష్మీనే యాంకర్ అయ్యే సరికి కన్నడ బ్యూటీ సౌమ్యరావును ‘జబర్దస్త్’కు కొత్త యాంకర్‌గా తీసుకున్నారు. సౌమ్య రాకతో రష్మీ మళ్లీ ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’కే పరిమితమైంది.

ఈ మధ్యకాలంలో రష్మీ పర్ఫామెన్స్ ఏం బాగోలేదని.. సౌమ్య వచ్చాక అందరూ ఆమె పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో రష్మీ రెమ్యూనరేషన్ భారీ తగ్గించేసిందట మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. అందుకు రష్మీ కోపంతో ఈ షో నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తుందట. తనకంటే వెనకొచ్చిన.. అందులోనూ జూనియర్ అయిన సౌమ్యకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తూ .. ఇన్నాళ్లు షో కోసం కష్టపడిన రష్మీ రెమ్యునరేషన్ తగ్గించడంతో.. కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే వార్త వైరల్ అవుతోంది. నిజంగానే ఈ బ్యూటీ షో నుంచి తప్పుకుంది అంటే ఈ షో టీఆర్పీల్లో భారీ మార్పులు వస్తాయంటున్నారు జనాలు. రష్మి లాంటి కత్తిలాంటి ఫిగర్ షోలో లేకపోతే ఎవడు చూస్తాడని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here