Anchor Pradeep : సాధారణంగా యాంకర్అంటే ఎక్కువగా అమ్మాయిలే కనిపిస్తుంటారు. వాళ్ల అందానికి తట్టుకుని నిలబడాలంటే అబ్బాయిలలో వారికన్నా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి. అలా ప్రస్తుతం తెలుగు బుల్లి తెరపై వాళ్ల పోటీని తట్టుకుని మరీ రాణిస్తున్న మేల్యాంకర్స్లో ప్రదీప్‌మాచిరాజు ఒకరు. తనదైన యాంకరింగ్‌తో చాలా కాలం నుంచే సత్తా చాటుతున్నాడు. అయితే అతడి పర్సనల్ లైఫ్గురించి, ముఖ్యంగా అతడి పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటోంది.
కెరీర్ ప్రారంభంలోనే బెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత చాలా షోలకు, కార్యక్రమాలకు, ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇప్పటికీ వరుస షోలను చేస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. తనదైన శైలిలో అదిరిపోయే వాక్చాతుర్యం, స్పాట్లో పంచులు వేయగల నైపుణ్యం కారణంగా కెరీర్ లో ది బెస్ట్ గా ముందుకు సాగుతున్నాడు. లుక్స్ పరంగానూ మెస్మరైజ్ చేసేస్తున్నాడు. అలా తన ప్రతిభ అండ్ లుక్స్‌తో మంచి మంచి ఆఫర్లను అందుకుంటున్నాడు.
అయితే హోస్ట్‌గా అలరిస్తున్న ప్రదీప్.. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. మొదట సపోర్టింగ్ రోల్స్ చేస్తూ పలు చిత్రాల్లో కనిపించాడు. అలా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వేలేదనిపించింది. కానీ, ఆ తర్వాత అతడు మళ్లీ ఏ సినిమా చేయలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నాడు. అయితే ఇటీవల ప్రదీప్ షేర్ చేసిన ఫొటోలతో పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా, ప్రదీప్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆయన ఓ టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. తొందరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. అయితే ఆమె ఎవరు? ఏ సినిమాల్లో నటించింది అనే విషయాలు ఇప్పటి వరకైతే తెలియదు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ కారణంగానే ప్రదీప్ పెళ్లికి దూరంగా ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వార్త మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.