ఆరోజుల్లో యాంకర్ ఝాన్సీ మరియు నాగార్జున మధ్య అప్పట్లో ఇంత నడిచిందా!

- Advertisement -

అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో తన తోటి హీరోలతో కానీ, హీరోయిన్స్ తో కానీ ఎంతో స్నేహంగా ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే.తనతో సరిసమానమైన ఇమేజి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకీ ఎంతో మంచి మిత్రుడు.వీళ్ళు స్నేహితులు అనేదానికంటే కూడా ఒకే కుటుంబం అని చెప్పొచ్చు, అంత అన్యోయంగా ఉంటారు.ఇక తన తర్వాతి తరం హీరోలతో కూడా నాగార్జున చాలా జోవియల్ గా ఉంటాడు.

అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున

ఇక హీరోయిన్స్ విషయం లో కూడా అంతే,అప్పట్లో ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ మొత్తం నాగార్జునతోనే ఎక్కువ క్లోజ్ గా ఉండేవాళ్ళు,ఇది చూసి ఆయన తోటి హీరోలు కాస్త అసూయ పడేవాళ్ళు.అందుకేనేమో ఆయనని అందరూ మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు.ఆయన హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉండడం చూసి అప్పట్లో మీడియా నాగార్జున కి సదరు హీరోయిన్స్ కి ఎఫైర్ ఉన్నట్లు గా కథనాలు కూడా ప్రచారం చేసేవి.

అయితే గతం లో నాగార్జున ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి ఇండస్ట్రీ లో సొంత కుటుంబ సభ్యులు లాగ అనిపించేది, తన మనసుకి ఎంతో దగ్గరైన వాళ్ళు ఇద్దరు ఉన్నారట.వారిలో ఒకరు సీనియర్ నటి లక్ష్మి అయితే, మరొకరు యాంకర్ ఝాన్సీ.చిన్నప్పటి నుండి లక్ష్మీ నాగార్జున తో చాలా ఆప్యాయంగా ఉండేవారట.

- Advertisement -
Nagarjuna rakul preet jhansi

ఆయనకి నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒకసారి నాగేశ్వర రావు గారితో కలిసి షూటింగ్ కి వస్తే ‘ఏయ్ హీరో.. ఇలా రా’ పిలిచేదట, అలా ఆమెతో చిన్నతనం నుండి ఎంతో స్పెషల్ బాండ్ ఉండేదట. ఆమె తర్వాత యాంకర్ ఝాన్సీ కూడా నాగార్జున కి బాగా క్లోజ్ గా ఉండేవారట, ఆమెతో కలిసి ఆయన ఎక్కువ సినిమాల్లో నటించినట్టు, ‘రావోయి చందమామ’ సినిమాలో హీరోయిన్ కి సరిసమానమైన పాత్ర చేసినట్టు నాగార్జున ‘మన్మధుడు 2 ‘ సినిమా విడుదల సమయం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఝాన్సీ కూడా ఒకరని నాగార్జున తెలిపాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here