Anchor Anasuya : బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ, క్రేజ్ ని దక్కించుకున్న యాంకర్ అనసూయ. కేవలం ఈమె కోసమే జబర్దస్త్ ని చూసే ప్రేక్షకులు ఉంటారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత అందంగా ఉంటుంది ఈమె. ఈమె అందానికి కచ్చితంగా మంచి హీరోయిన్ రోల్స్ వస్తుందని అనుకున్నారు ఆడియన్స్. కానీ ఎందుకో ఆమెకి అన్నీ విలన్ రోల్స్ వస్తున్నాయి. మధ్యలో రంగమ్మ అత్త లాంటి మంచి పాత్రలు కూడా చేసింది.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి చేసిన ‘పుష్ప : ది రైజ్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో అనసూయ క్యారక్టర్ ని కూడా మర్చిపోలేరు. ఈ సినిమా దెబ్బతో ఆమె పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె అప్లోడ్ చేసిన ఒక వీడియోకి సోషల్ మీడియా లో వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏమి ఉందంటే అనుష్క తన పెంపుడు కుక్కని గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతున్నట్టుగా ఉంది. ఆమె గట్టిగ హత్తుకోవడం తో ఊపిరి ఆడక ఆమె నుండి తప్పించుకొని ఆ కుక్క పారిపోతుంది. అప్పుడు పెరిగిస్తూ దానిని పట్టుకొని తన తలకి దిండు లాగ పెట్టుకుంది అనసూయ. ఈ వీడియో మొత్తానికి ఒక ఆడియో ని కూడా జత చేసింది.

దీని క్రింద నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ‘మేము నీ పైన ఏడుస్తున్నాం అని అంటుంటావు..ఆ వీడియో కి అలాంటి ఆడియో పెడితే ఏడవకుండా ఎవరు ఉంటారు చెప్పండి’ అని కామెంట్స్ చేసారు. ఒక నెటిజెన్ అయితే ‘కనీసం కుక్కని కూడా వదలవా’ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా కామెంట్స్ చేసాడు. అనసూయ కి సోషల్ మీడియా లో నెగటివిటీ బలంగా ఉందనే విషయం తెలిసిందే. కానీ ప్రతీ చిన్న విషయం లో నెగటివ్ యాంగిల్ ని చూడడం కరెక్ట్ కాదు.