Anchor Anasuya : బుల్లితెర మీద బంపర్ హిట్ గా నిల్చిన జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంతోమంది నేడు ఇండస్ట్రీ కి వచ్చారు. వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. అంతకు ముందు ఈమె పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటించే అవకాశం దక్కింది కానీ, ఆమె ఎవరు అనేది ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టిందో ఆమె జాతక చక్రం మొత్తం మారిపోయింది.
బుల్లితెర మీద ఆమెని చూసిన వెంటనే అనుష్క గుర్తుకువచ్చేది. ఇంత అందంగా ఉంది, ఈమె ఎందుకు సినిమాల్లో హీరోయిన్ గా వెళ్ళలేదు అని అనుకునేవారు ఆడియన్స్. హీరోయిన్ రోల్స్ అయితే మేకర్స్ ఇవ్వలేదు కానీ, క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు లేడీ విలన్ రోల్స్ మాత్రం బాగానే ఇచ్చారు. పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం ఆమె ‘పుష్ప : ది రూల్’ చిత్రం లో నటిస్తుంది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో అనసూయ ఎప్పుడు వివాదాలతో సావాసం చెయ్యడం మనం చూస్తూనే ఉన్నాం. ఈమెపై ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేస్తే అసలు తీసుకోలేదు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈమె సోషల్ మీడియా లో పొట్టి బట్టలు వేసుకుంటూ ఫోటోలు దిగి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దీనిపై నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉండేవారు. ఇద్దరు పిల్లలకు తల్లివి అయ్యుండి ఇలాంటి ఫోటోలు ఎలా అప్లోడ్ చేస్తున్నావు.
వాళ్ళు చూస్తే ఎలా ఫీల్ అవుతారు వంటి కామెంట్స్ చేసేవారు. దీనిపై ఆమె మళ్ళీ ప్రస్తావయిస్తూ నిన్న మళ్ళీ అలాంటి కామెంట్స్ చేస్తే రఫ్ఫాడించేస్తాను, చీల్చి చెండాడేస్తాను అంటూ భీకరమైన ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ వార్నింగ్ ఇచ్చింది. ఇది చూసిన తర్వాత కేలండర్ లో సంవత్సరాలు మరియు డేట్స్ మారుతున్నాయి కానీ, నీ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అంటూ నెటిజెన్స్ అంటున్నారు.