బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ.. అక్కినేని నాగార్జునను ఉద్దేశిస్తూ జబర్దస్త్ కామెంట్ చేసింది. నాగార్జున అంటే తనకు ఎప్పటికీ క్రష్ అంటూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఆయనతో దిగిన పిక్స్ షేర్ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం పేరెంట్స్ కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అనసూయ ది బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ. బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకసారి నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా జబర్దస్త్ ట్వీట్ చేసి ఆకట్టుకుంది హాట్ యాంకర్ అనసూయ.

తనకు నాగార్జున అంటే ఎప్పటికీ క్రష్ అని పేర్కొంటూ నాగార్జునను కౌగిలించుకున్న పిక్ షేర్ చేసింది. అంతేకాదు నాగార్జునను ఎవర్ చార్మింగ్, యంగ్ అండ్ ఎవర్‌గ్రీన్ అని పొగిడేస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది అనసూయ.బుల్లితెరపై హాట్ యాంకర్‌గా కొనసాగుతూనే వెండితెరపై కాలు మోపిన అనసూయ, అక్కినేని నాగార్జునతో కలిసి ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో అనసూయ గ్లామర్ అప్పియరెన్స్, అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ద్వారానే నాగార్జున, అనసూయ మధ్య మంచి బాండింగ్ నెలకొందని సమాచారం. అయితే అనసూయ కు అవకాశాలు రావడానికి నాగార్జున ఎలా కారణమయ్యాడు అంటే ఓ రోజు అనసూయ ఓ డైరెక్టర్ తో నాగార్జున దగ్గరికి సినిమా అవకాశం కోసం వెళ్ళిందట. దాంతో అప్పుడే నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక పాత్రలో నటించే అవకాశం ఇచ్చారట.అయితే ఈ పాత్రకి అనసూయ కి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత క్షణం ,రంగస్థలం వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇలా యాంకర్ అనసూయ కి నాగార్జున కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది.